1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Former TDP MLC Rajendra Prasad falls sick in Vijayawada, doctors claim no danger

టీడీపీ సీనియర్ నేత రాజేంద్ర ప్రసాద్‌కు గుండెపోటు

rajendra prasad
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ బుధవారం గుండెపోటుకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయనను, కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. 
 
అయితే, ఆయనకు యాంజియోగ్రామ్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ కేవలం టీడీపీలో సీనియర్ నేతగానే కాకుండా, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర గౌవరాధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని తమ అభిమాన నేత ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారు. 
తర్వాతి కథనం
మంత్రి వస్తే లేచి నిలబడాలన్న కామన్ సెన్స్ లేదా : మంత్రి జోగి రమేష్ ఫైర్