సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 మే 2023 (14:24 IST)

ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైకాపా ఫ్లెక్సీలు.. ఎన్టీఆర్, సీఎం జగన్.. ఇంకా..?

NTR
NTR
బెజవాడలో ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైకాపా ఫ్లెక్సీలు కలకలం రేపాయి. పటమట సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైకాపా ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది. ఎన్టీఆర్, సీఎం జగన్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 
 
ఎన్టీఆర్‌కి శత జయంతి నీరాజనాలు అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. అయితే అవినాష్ ఫ్లెక్సీల ఏర్పాటుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ ఘటనపై స్పందించిన తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్.. టీడీపీపై సెటైర్లు వేశారు. 
 
ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవం.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని దేవినేని అవినాష్ అన్నారు. అంతేగాకుండా ఎన్టీఆర్ లలితకళా అవార్డును పోసానికి ఇస్తున్నామని.. టీడీపీ అధికారంలో వున్నప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావన కూడా లేకుండా చేసేవారని ఫైర్ అయ్యారు. 
 
ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన నేత జగన్ అని గుర్తు చేశారు. తాము కూడా ఎన్టీఆర్ అభిమానులమేనని, ఎన్టీఆర్‌కు బ్యానర్లు కట్టే హక్కు మాకుందన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి రాసివ్వలేదన్నారు.