ఫిబ్రవరి 7న "తండేల్" రిలీజ్.. సంక్రాంతితో పోటీ వద్దు.. వాలెంటైన్స్ డేనే ముద్దు
Tandel
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, క్రిస్మస్ అనుకున్నాం.. సంక్రాంతికి కాదు.. ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో సినిమా తెరకెక్కుతుంది.
టాలీవుడ్ సినిమాలు అంటేనే సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉంటాయి. బాలయ్య, వెంకీ, రామ్ చరణ్ సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఈ దశలో తండేల్ని దింపడం అంత బెటర్ ఆప్షన్ కాదన్నది గీతా ఆర్ట్స్ అభిప్రాయం.
పైగా.. వెంకటేష్ సినిమా బరిలో ఉంది. అలాంటప్పుడు చైతూ రిస్క్ తీసుకోలేరు. పైగా మెగా కుటుంబం నుంచి "గేమ్ ఛేంజర్" వస్తోంది. అందుకే తండేల్‌ను కాస్త వెనక్కి నెట్టారని సినీ పండితులు అంటున్నారు. అయితే వాలెంటైన్స్ డేకు ముందుగా ఈ సినిమా రిలీజ్ చేస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని వారు చెప్తున్నారు.
