బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2024 (15:57 IST)

నేను ఇంట్రోవర్ట్ పర్సన్ ను కానీ కిరణ్ అబ్బవరం ని కలిశాక మారాను : నాగచైతన్య

chitu, kiran and team
chitu, kiran and team
కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నాగ చైతన్య ముఖ్య అతిథిగా  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. 
 
హీరో నాగ చైతన్య మాట్లాడుతూ - నేను ఇంట్రోవర్ట్ పర్సన్ ను. కొత్త వాళ్లతో పెద్దగా కలవను. అయితే రీసెంట్ గా కిరణ్ చెన్నైలో కలిశాడు. అతనితో మాట్లాడిన కొద్దిసేపటికే చాలా దగ్గరి ఫ్రెండ్ లా అనిపించాడు. తనకు నా వల్ల అయిన సపోర్ట్ చేయాలనిపించింది. కిరణ్ అబ్బవరం జర్నీకి నేను నెంబర్ వన్ ఫ్యాన్ ను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో మంచి ప్రొటెక్షన్ తో వచ్చాను. తనకు ఎవరి సపోర్ట్ లేదు. స్వతహాగా ఎదిగాడు. కిరణ్ సక్సెస్ స్టోరీ నాకు ఇన్సిపిరేషన్ గా నిలుస్తుంది. ఇండస్ట్రీకి వచ్చే ఎంతోమందికి కిరణ్ స్ఫూర్తిగా నిలుస్తారు. ఇలాంటి హీరోస్ సక్సెస్ కావాలి. నేను "క" సినిమా  ట్రైలర్ చూశాను. బాగా నచ్చింది. కిరణ్ ఫోన్ చేసి ప్రి రిలీజ్ కు గెస్ట్ గా రావాలని పిల్చినప్పుడు హ్యాపీగా ఫీలయ్యా. ఇలాంటి మంచి మూవీ ప్రమోషన్ లో  భాగమవడం సంతోషంగా ఉంది. కిరణ్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. క సినిమా ప్రీ రిలీజ్ కు వెళ్తున్నానని ఒక ఫ్రెండ్ కు చెబితే కిరణ్ అబ్బవరం క సినిమానా అన్నారు. అంటే సినిమా ముందు నీ పేరు రికగ్నైజ్ అవుతోంది. నువ్వు ఆ గుర్తింపు తెచ్చుకున్నావు. నీ ఇంటర్వ్యూస్ చూశాను. ఎంతో ర్యాగింగ్ ప్రశ్నలకు కూడా మెచ్యూర్డ్ గా సమాధానాలు చెప్పావు. నీలో ఎంతో శక్తి ఉంది కిరణ్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ జర్నీ అమేజింగ్. ట్రోల్ చేసే వారికి కీ బోర్డ్ తప్ప బ్రెయిన్ లో ఏమీ ఉండదు. ట్రోల్స్ కు భయపడే స్థాయి దాటేశావు. ఫ్లాప్స్, హిట్స్ ఎవరికైనా కామన్. ప్రతి వారి సక్సెస్ వెనకాల మహిళ సపోర్ట్ ఉంటుంది. కిరణ్ కు వాళ్ల అమ్మతో పాటు రహస్య సపోర్ట్ కూడా దొరికింది. "క" సినిమా  టీమ్ ను కలిసినప్పుడు వారు సినిమా కోసం ఎంత హానెస్ట్ గా కష్టపడ్డారో తెలిసింది. "క" సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. "క" సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
 
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - ఈ రోజు మా "క" మూవీ ప్రీ రిలీజ్ కు నాగ చైతన్య గారి లాంటి మంచి పర్సన్ గెస్ట్ గా రావడం హ్యాపీగా ఉంది. ఆయన పాజిటివిటీతో మాకూ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. నాకు సినిమానే ప్రాణం. అందుకే ఏ ఉద్యోగం చేసినా మనసు సినిమా వైపే లాగేది. అలా ఇండస్ట్రీకి వచ్చాను. సక్సెస్ వచ్చింది. పెద్ద బ్యానర్స్ లో మూవీస్ చేశా. అయితే కొన్ని ఆడాయి, కొన్ని సినిమాలు ఆడలేదు. అయితే ప్రతి రోజూ సినిమా కోసం కష్టపడుతూనే వచ్చాను. ఎంతో బాధపడేవాడిని అనుకున్నట్లు సినిమాలు మీకు రీచ్ కావడం లేదని. నా కెరీర్ లో 8 సినిమాలు చేస్తే 4 సినిమాలు డీసెంట్ గా ఆడాయి. నేను యాక్టర్ గా ఫెయిల్ కాలేదు. ప్రతి హీరోకు ఫెయిల్యూర్స్ ఉంటాయి. నా లాంటి హీరో తన సినిమాను థియేటర్ దాకా తీసుకురావడమే సక్సెస్. అలా నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్తున్న టైమ్ లో ఒకరు తమ సినిమాలో నాపై ట్రోలింగ్ డైలాగ్స్ పెట్టారు. నేను మీకు ఏం చేశానని అలా నన్ను తక్కువ చేసేలా మీ సినిమాలో డైలాగ్స్ పెట్టారు. నాకు బాధగా అనిపించి ఈ వేదిక మీద ఆ విషయం మాట్లాడుతున్నా.
 
"క" సినిమా విషయానికొస్తే నేను లాస్ట్ ఇయర్ చెప్పాను. ఏడాదిలో ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తానని. చెప్పినట్లే క అనే మంచి సినిమాతో మీ ముందుకు ఈ నెల 31న రాబోతున్నాం. "క" సినిమా బ్యాడ్ మూవీ అని మీలో ఎవరైనా అంటే నేను సినిమాలు చేయడం మానేస్తా. ఎవరెవరికి ఎంత నచ్చుతుందో తెలియదు గానీ మంచి ప్రయత్నం అని మాత్రం అంటారు. నేను ప్రామిస్ చేస్తున్నా. థియేటర్స్ కు వెళ్లండి "క" సినిమా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.
 
ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ - మా "క" మూవీ ఈవెంట్ కు నాగ చైతన్య లాంటి మంచి మనసున్న హీరో రావడం సంతోషంగా ఉంది. కిరణ్ గారి మీద నాకు నమ్మకం ఉండే ఈ సినిమా ప్రొడ్యూస్ చేశాను. ఆయన నాకు ఏ మాటైతే ఫస్ట్ ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్నీ తానై ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్ గా స్క్రీన్ మీదకు తీసుకొస్తున్నారు. నాకు రిస్క్ లు చేయడం ఇష్టం. మా హీరోయిన్స్ బాగా నటించారు. డైరెక్టర్స్ సందీప్, సుజీత్ అందరినీ ఆకట్టుకునేలా సినిమా రూపొందించారు. సామ్ సీఎస్ తన మ్యూజిక్ తో సినిమాకు ప్రాణం పోశారు. తప్పకుండా మా సినిమా ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది. అన్నారు.
 
డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ - మేము మూడేళ్ల క్రితం ఈ సినిమా కల గన్నాం. ఆ కలను నిజం చేసిన మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారికి థ్యాంక్స్. అలాగే కిరణ్ అన్న ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేం. మా మూవీలో 600 సీజీ షాట్స్ ఉంటాయి. అవన్నీ పర్పెక్ట్ చేయగలిగాం. మా టీమ్ లోని ప్రతి డిపార్ట్ మెంట్ హార్ట్ అండ్ సోల్ పెట్టి పనిచేశారు. ఈ నెల 31న థియేటర్స్ లోకి వస్తున్నాం. సక్సెస్ కొడుతున్నాం. "క" మీద మా అందరిలో ఉన్న నమ్మకం ఇదే. అన్నారు.