క సినిమా మా ఆయన కోసం చూడమంటున్న రహస్య గోరక్ (video)
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
కిరణ్ అబ్బవరం హీరోగా ఈ దీపావళి పండుగకు విడుదలవుతున్న చిత్రం క. ఈ సినిమా ప్రి-రిలీజ్ వేడుకలో కిరణ్ భార్య రహస్య గోరక్ క సినిమా ఎందుకు చూడాలో తెలియజేసింది. ఈ చిత్రం చూడటానికి ముచ్చటగా 3 కారణాలున్నాయని చెప్పిన రహస్య... ఆ మూడింటిలో ఒక కారణం మా ఆయన అంది. మా ఆయన కోసం సినిమా చూడాలని అభ్యర్థించింది.
హీరో కిరణ్ అబ్బవరం కష్టపడే తత్వం ఉన్న హీరో. చాలా మంచివాడు. "క" సినిమాకు ఎంతో శ్రమించి వర్క్ చేశాడు. మే నెలలో మధ్యాహ్నం షూటింగ్ మొదలుపెడితే మళ్లీ ఉదయం దాకా డబల్ కాల్ షీట్ వర్క్ చేసేవాడు. రాత్రి 12 వరకు షూటింగ్ చేసినా మళ్లీ ఉదయమే 5 గంటలకు సెట్‌కు వచ్చేవాడు. షూటింగ్ చేస్తున్న స్టూడియో వాళ్లు కూడా మీ టీమ్ తక్కువ టైమ్‌లో ఎక్కువ వర్క్ చేస్తున్నారు అని అనేవారు.