శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2024 (20:59 IST)

కర్వా చౌత్: ఆహారంలో విషం కలిపింది... భర్తకు ఇచ్చింది.. అతనికి ఏమైందంటే?

Food
ఆహారంలో విషం కలిపి తన భర్తను చంపినందుకు ఓ మహిళను ఇక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఉత్తరప్రదేశ్, కడధామ్ ప్రాంతంలోని ఇస్మాయిల్‌పూర్ గ్రామానికి చెందిన శైలేష్ (32) ఆదివారం రాత్రి కర్వా చౌత్ పండుగ సందర్భంగా రాత్రి భోజనం చేసిన అనంతరం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడని సిరతు సర్కిల్ అధికారి అవధేష్ కుమార్ విశ్వకర్మ తెలిపారు. 
 
స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారి తెలిపారు. శైలేష్ భార్య సవిత (30) తన ఆహారంలో విషం కలిపిందని ఆరోపిస్తూ శైలేష్ కుటుంబం ఫిర్యాదు చేసినట్లు విశ్వకర్మ తెలిపారు.
 
ఫిర్యాదు ఆధారంగా సవితపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105, 123 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.