సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2024 (17:58 IST)

క సినిమాలో ఎలిమెంట్ గతంలో చూశామని అనిపిస్తే సినిమాలు ఆపేస్తా : కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram, Nayan Sarika, Tanvi Ram
Kiran Abbavaram, Nayan Sarika, Tanvi Ram
కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్ లో చిత్ర ట్రైలర్ ను విడుదలచేశారు.
 
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, సినిమా రిలీజ్ కు . చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాం. 31న కేవలం తెలుగులో మాత్రమే సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఒకవారం తర్వాత కన్నడ, తమిళ, మలయాళంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మలయాళంలో దుల్కర్ లక్కీ భాస్కర్ సేమ్ డేట్ కు రిలీజ్ అవుతోంది. కాబట్టి ఒక వారం ఆగి "క" సినిమాను ఆ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించాం. 
 
తెలుగులో మీరు మంచి సక్సెస్ ఇస్తే ఆ భాషల నుంచి రెస్పాన్స్ బాగా వస్తుంది. "క" సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి ఒక మంచి కథ ప్రేక్షకులకు చూపించాలి అనిపించింది. నా గత సినిమాల్లో కంటెంట్ పరంగా కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అలాంటివి లేకుండా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు ఎంతో జాగ్రత్తగా సినిమాను చేశాం. దీని వెనక మా టీమ్ లోని ప్రతి ఒక్కరి కృషి ఉంది. మా మూవీ క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం హైలైట్ అవుతుంది. క్లైమాక్స్ సీన్స్ మొత్తం సర్ ప్రైజ్ చేస్తాయి. "క" సినిమాలో అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ఫైట్స్ కూడా భారీగా కావాలని పెట్టలేదు. ఇదొక థ్రిల్లర్ మూవీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వెళ్తుంటుంది. 
 
కథలో కావాల్సివచ్చినప్పుడు మాత్రమే యాక్షన్ సీన్స్ పెట్టాం. "క" సినిమాలో ఏదైనా ఎలిమెంట్ గతంలో స్క్రీన్ మీద చూశామని మీకు అనిపిస్తే నేను సినిమాలు చేయడం ఆపేస్తా. వాసుదేవ్ అనే క్యారెక్టర్ లో అనేక షేడ్స్ ఉన్నాయి. గ్రే షేడ్స్ కూడా కనిపిస్తాయి. వాసుదేవ్ కు పక్కవాడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కోరిక. అందుకే వేరేవాళ్ల ఉత్తరాలు చదువుతుంటాను. ఆ క్రమంలో అతని లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. "క" సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.
 
దర్శకుడు సందీప్ మాట్లాడుతూ, "క" సినిమాను స్క్రీన్ మీద కొత్తగా ప్రెజెంట్ చేశాం. 1970, 80 కాలాన్ని ప్రతిబింబించేలా ప్రతి సీన్ డిజైన్ చేసుకున్నాం. కృష్ణగిరి అనే ఊరు యూనిక్ గా ఉండేలా మధ్యాహ్నం చీకటి పడే ఎలిమెంట్ తీసుకున్నాం. సినిమా బిగిన్ అయిన ఫస్ట్ మినిట్ నుంచే క ప్రపంచంలోకి వెళ్తారు, వాసుదేవ్ క్యారెక్టర్ కు కనెక్ట్ అవుతారు.
 
డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ - "క" సినిమా ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా ఫోన్స్ వస్తున్నాయి. మా సినిమా దీపావళికి కాసుల వర్షం కురవాలని కోరుకుంటున్నా. ఒక ఆడియెన్ గా ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎంతగా ఎగ్జైట్ అయ్యానో 30వ సారి చూసినప్పుడు కూడా అంతే ఎగ్జైట్ అయ్యాను. మనం విరూపాక్ష గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. క సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాను కూడా రిఫరెన్స్ గా తీసుకుంటారనే నమ్మకం ఉంది.  సినిమా చూశాక నాకు అనిపించిన సజెషన్స్ టీమ్ కు చెప్పాను. దీపావళికి ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. తప్పకుండా మీ ఆదరణ దక్కుతుందని కోరుకుంటున్నాం. అన్నారు.