ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (10:10 IST)

పుష్ప-2తో చైతూపై రివంజ్ తీసుకోనున్న సమంత?

Samantha
Samantha
అవును.. పుష్ప-2తో తన మాజీ భర్త నాగచైతన్యపై సమంత రివంజ్ తీసుకోనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పుష్ప-1లో ఐటమ్ గర్ల్‌గా మారిన సమంత.. పుష్ప-2లోనూ తన ఐటం డ్యాన్సుతో అదరగొట్టనుందని సమాచారం. 
 
ఇప్పటికే పుష్ప-2లో ఐటం కోసం పలువురు హీరోయిన్లను సుక్కు పరిశీలించారు. తాజాగా శ్రీలీలను పుష్ప-2 కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మళ్లీ ఈ పాట కోసం సమంత అయితేనే బాగుంటుందని సమంతను సంప్రదించారని టాక్. 
 
తొలి భాగంలో ఊ అంటావా పాటకు స్టెప్పులేసి.. అందాలు ఆరబోసి విడాకులు ఇచ్చిన హీట్‌తో చైతూకు షాకిచ్చిన సమంత.. చైతూ రెండో పెళ్లి చేసుకుంటున్న చైకి పుష్ప-2లో మాస్ సాంగ్‌తో అందాలు ఆరబోసి షాకివ్వాలని అనుకుంటున్నట్లు టాక్. 
 
తాను చై నుంచి దూరమైనా.. ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా.. కెరీర్ పరంగా ఏమాత్రం వెనక్కి తగ్గలేదనే విషయాన్ని చైకి పుష్ప-2 సాంగ్ ద్వారా చెప్పాలని సమంత ఉవ్విళ్లూరుతోంది. మరి ఈ ఛాన్స్ సమంతకు వస్తుందా.. శ్రీలలకు దక్కుతుందా అనేది వేచి చూడాలి.