ఉస్తాద్ రామ్ పోతినేని, కావ్యా థాపర్ కెమిస్ట్రీ అదుర్స్
Ram, kavya thapar
ఇప్పుడు మేకర్స్ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. డబుల్ ఇస్మార్ట్ థర్డ్ సింగిల్ క్యా లఫ్డా జూలై 29న రిలీజ్ కానుంది. రామ్, కావ్యా థాపర్ రొమాంటిక్ కెమిస్ట్రీని వండర్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన అనౌన్స్మెంట్స్ పోస్టర్ చాలా ఎట్రాక్టివ్ గా వుంది. ఉస్తాద్ రామ్ పోతినేని, కావ్యా థాపర్ కెమిస్ట్రీ అదుర్స్ అని చిత్ర యూనిట్ చెపుతుంది.
పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. సామ్ కె నాయుడు, జియాని గియానెలీ సినిమాటోగ్రఫీ అందించారు.
డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.
నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు.
