సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 26 జులై 2024 (20:38 IST)

వీరాంజనేయులు విహారయాత్ర విజువల్ ట్రీట్ లా వుంటుంది : డా. నరేశ్ వికె

Veeranjaneyulu Viharayatra team
Veeranjaneyulu Viharayatra team
డా. నరేశ్ వికె, రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’.అనురాగ్‌ పలుట్ల దర్శకత్వం వహించారు.  బాపినీడు.బి, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 14న ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీం కాబోతోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. యాక్ట్రెస్ పవిత్ర లోకేష్ టీజర్ ని లాంచ్ చేశారు. డైరెక్టర్ సందీప్ రాజ్, వినోద్, ప్రవీణ్ కంద్రేగుల, హీరో తిరువీర్ పాల్గొన్న టీజర్  లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది
 
వీరాంజనేయులు అస్థికల చెంబుకు బ్రహ్మానందం చెప్పిన వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ హిలేరియస్ గా వుంది. కుటుంబమంతా కలిసి చూసే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ అనురాగ్ ఈ చిత్రాన్ని మలిచారని టీజర్ చుస్తే అర్ధమౌతోంది. నరేశ్‌ కామెడీ టైమింగ్‌, పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రియా వడ్లమాని, రాగ్‌ మయూర్‌ పాత్రలు కూడా ఆసక్తికరంగా వున్నాయి. మ్యూజిక్, విజువల్స్ వున్నత స్థాయిలో వున్నాయి. మొత్తనికి టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచాయి.
 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డా. నరేష్ వికె మాట్లాడుతూ.. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు అనే మాటకు నిదర్శనం రామోజీరావు గారు. ఆయన కృషితో ఒక లెజెండ్ గా ఎదిగి తెలుగు సినిమాని ప్రపంచ సినిమా చరిత్రపుటలో పెట్టి నవ్వుతూ వెళ్ళిపోయారు. నా బండికి నాలుగు చక్రాలు. విజయ నిర్మల గారు, కృష్ణ గారు, జంధ్యాల గారు, రామోజీరావు గారు. రామోజీరావు గారిని చాలా మిస్ అవుతున్నా. ఉషాకిరణ్ మూవీస్ శ్రీవారికి ప్రేమ లేఖ తో హీరోగా స్టార్ట్ అవ్వడం నా అదృష్టం. అప్పటి నుంచి ఆ కుటుంబంలో ఒకరిగానే భావిస్తాను. శ్రీవారికి ప్రేమలేఖ సినిమాతో బాపినీడు గారితో పరిచయం. వీరాంజనేయులు విహారయాత్రకి ఆయన బ్యాక్ బోన్. ఎక్కడా లోటు లేకుండా అద్భుతంగా సినిమాని నిర్మించారు. అనురాగ్ చాలా ప్రతిభవున్న దర్శకుడు. స్క్రిప్ట్ విన్నాక.. జంద్యాల, త్రివిక్రమ్, వివేక్ ఆత్రేయ అలాంటి వినూత్నమైన ఒరవడి తనలో కనిపించింది. తనకి అన్ని క్రాఫ్ట్స్ పై మంచి కమాండ్ వుంది. ఇది విజువల్ ట్రీట్. శతమానం భవతి సినిమా ఎన్ఆర్ఐ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం కూడా అలానే అలరిస్తుంది. చాలా అద్భుతమైన ఎమోషన్ వున్న కథ ఇది. ఉషాకిరణ్ మూవీస్ లో శ్రీవారికి ప్రేమ లేఖ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ఈటీవీ విన్ లో ఇది అంత పెద్ద సక్సెస్ అవుతుంది. నితిన్,  సాయి కృష్ణ చాలా సపోర్ట్ చేశారు. ఇది నాకు గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్. గోల్డెన్ ఫిల్మ్. రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని అందరూ అద్భుతంగా నటించారు. ఆగస్ట్ 14న విడుదలయ్యే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది' అన్నారు
 
యాక్ట్రెస్ పవిత్ర లొకేషన్ మాట్లాడుతూ.. రామోజీరావు గారు గ్రేట్ విజనరీ. ఆయన సేవలు మరువలేనివి. గ్రేట్ విజన్ తో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. ఈటీవీతో నాకు ఎంతో అనుబంధం వుంది. ఈటీవీ విన్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’ టీజర్ లాంచ్ చేయడం ఆనందంగా వుంది. నరేష్ గారు గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. ప్రతి పాత్రకు ఆయన చేసే హోం వర్క్ చాలా ఇంట్రస్టింగా వుంటుంది, టీజర్ చాలా ఎక్సయిటింగ్ వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు.
 
డైరెక్టర్ సందీప్ రాజ్.. ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచూస్తున్నాను. నరేష్ గారికి చాల పెద్ద ఫ్యాన్ ని, రాగ్ మయూర్ సినిమా బండితో అందరినీ అలరించాడు. తనతో కలసి పని చేయాలని వుంది. ప్రియా ఈ కంటెంట్ తో అందరికీ తెలుసుస్తుందని భావిస్తున్నాను,  నితిన్, సాయి కృష్ణ కంటెంట్ ని నమ్మి చేస్తారు, ఈ సినిమాతో ఈటీవీ విన్ ఇంకా గట్టిగా ఫ్యామిలీస్ లోకి వెళుతుందని కోరుకుంటున్నాను' అన్నారు.
 
హీరో తిరువీర్ మాట్లాడుతూ...ఈ సినిమాలో చాలా మంది ఫ్రెండ్స్ పని చేశారు. ఈ కథ నాకు తెలుసు. చాలా మంచి కథ,  అనురాగ్ ఎప్పుడు డైరెక్టర్ అవుతాడా అనుకునేవాడిని, ఆగస్ట్ 14 తనకి స్వాతంత్రం( నవ్వుతూ). టీజర్ చాలా బావుంది. చాలా మంచి సినిమా. రిపీట్ గా చూసే సినిమా అవుతుంది' అన్నారు.
 
ETV విన్ - కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ..  ఆగస్ట్ 14  ‘వీరాంజనేయులుకి స్వాతంత్రం రాబోతుంది. ఈ సినిమా ఫాదర్స్ అందరికీ  అంకితం చేస్తున్నాం, అనురాగ్ పెద్ద డైరెక్టర్ అవుతాడు. చాలా అద్భుతంగా తీశాడు. సినిమా యూనిట్ అందరికీ థాంక్స్. నరేష్ గారు అద్భుతంగా నటించారు. ఆయన ఈ ప్రాజెక్ట్ డైమెన్షన్స్ ని మార్చారు. అందరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా వుంటుంది' అన్నారు,
 
దర్శకుడు అనురాగ్ పాలుట్ల మాట్లాడుతూ.. ‘వీరాంజనేయులు విహారయాత్ర' నాలుగు కాలాలు పాటు గుర్తుండే సినిమా అవుతుంది. ఇది పొగరుతో కాదు ప్రేమతో చెబుతున్నాను. చాలా ప్రేమతో ఈ సినిమా చేశాం. అందరూ చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్' అన్నారు  
 
హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అతిధులందరికీ థాంక్స్. ఆగస్ట్ 14న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ సపోర్ట్ చేయాలి'అని కోరారు. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.