సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 జులై 2024 (20:26 IST)

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

Ram Pothineni   Kavya Thapar
Ram Pothineni Kavya Thapar
ఉస్తాద్‌ రామ్‌ పోతినేని, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న 'డబుల్‌ ఇస్మార్ట్‌' ఆగస్ట్‌ 15న ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
 
మేకర్స్ మాస్ సాంగ్ అఫ్ ది ఇయర్ స్టెప్పా మార్ తో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు. ఇది ఆడియో ప్రమోషన్‌లకు చార్ట్‌బస్టర్ స్టార్ట్, మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను అందజేయడం ద్వారా పబ్లీసిటీ దూకుడు పెంచారు.
 
'డబుల్ ఇస్మార్ట్' హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌, మచ్ ఎవైటెడ్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది.
 
సామ్ కె నాయుడు, జియాని గియాన్నెలి సినిమాటోగ్రఫర్స్ కాగా, మణి శర్మ మ్యూజిక్ అందించారు.
 
నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను, తదితరులు.