సంబంధిత వార్తలు
- బట్టల షాపులో సేల్స్ మెన్స్గా రామ్‌చరణ్, రష్మిక మండన్న
- మెగాస్టార్ చిరంజీవి నిజ జీవితంలో కూడా హీరో - గవర్నర్ డా. తమిళిసై
- #FirstDayFirstShow అసలు సీక్రెట్ చెప్పిన చిరంజీవి.. నేలటికెట్ తీసుకుని..? (video)
- చిరంజీవి, రవితేజ కాంబినేషన్లో భారీ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం
- వైభవంలేని రంగ రంగా - రివ్యూ రిపోర్ట్
రష్మీలో ఆ ఎక్స్‌ప్రెషన్స్ అదుర్స్.. ఐటమ్ గర్ల్‌గా ఆమె పక్కా? ఉప్పెన హీరో
Vaishnav_Rashmi
ఈ సినిమా తర్వాత ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఈయన నటించిన తదుపరి చిత్రాలు రెండు కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇలా వైష్ణవ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం రంగా రంగా వైభవంగా. గిరీషయ్యా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వైష్ణవ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ వైష్ణవ్ తేజ్‌ను ప్రశ్నిస్తూ.. మీ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాలనుకుంటే ఏ హీరోయిన్ చేయాలని భావిస్తారంటూ ప్రశ్నించారు.
ఇక ఈ ప్రశ్నకు వైష్ణవ్ తేజ్ ఊహించని విధంగా యాంకర్ రష్మీ పేరు చెప్పారు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రష్మీ పేరు చెప్పడమే కాకుండా రష్మీలో హాట్ ఎక్స్‌ప్రెషన్స్ పలికించే తీరు తనకు ఎంతగానో నచ్చుతాయని ఈ మెగా హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ విధంగా వైష్ణవ్, రష్మీ గురించి ఇలాంటి సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. అదేంటి వైష్ణవ్ రష్మీ గురించి అలా మాట్లాడేసావ్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తర్వాతి కథనం
