గంటలో 1.3 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించిన ‘వాలిమై’ మోషన్ పోస్టర్
Alimai
ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అయిన సినిమా ఇది. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ క్రేజ్ ఉన్న ఆట ఫుట్‌బాల్. లండన్‌లో యూరో 2020 మ్యాచ్ జరుగుతున్న సమయంలో అజిత్ కొత్త సినిమా వాలిమైకి సంబంధించిన అప్డేట్ తెలియజేయాలంటూ అజిత్ ఫ్యాన్స్ చూపిస్తున్న ఫ్లకార్డ్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా అజిత్ క్రేజ్ ఎంతలా ఉందో ఈ ట్వీట్ తెలియజేస్తుంది. రెగ్యులర్‌గా ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. ఈ చిత్రంలో ఆడియన్స్‌ని థ్రిల్ చేసే డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. వాలిమై మోషన్ పోస్టర్ విడుదలైన ఒక గంటలో 1.3 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించి ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌లో ఉంది.

