Virat Karna: నాగబంధం లో రెండు రకాల గెటప్స్‌లో విరాట్ కర్ణ లుక్ విడుదల
Virat Karna Two getups in Nagabandham
ఈ మేరకు విడుదల తేదీ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రెండు రకాల గెటప్స్‌లో హీరో కనిపిస్తున్నారు. పై భాగంలో శివుడిగా హీరోగా పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక కింది భాగంలో మోడ్రన్ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ రెండు లుక్స్‌తో డిజైన్ చేసిన పోస్టర్ ఆడియెన్స్‌లో మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది. శివుడిగా విరాట్ లుక్‌కి ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ పోస్టర్ అయితే నెక్ట్స్ లెవెల్లో ఉంది.
ఈ చిత్రం ఇప్పటికే ఆడియెన్స్‌లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్, భక్తి గీతం 'నమో రే' ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయడంతో టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టనుంది. ఇకపై వరుస అప్డేట్లతో ప్రేక్షకుల్లో మరింత బజ్‌ను పెంచేలా టీం ప్లాన్ చేస్తోంది.
విలక్షణమైన ఇతివృత్త సమ్మేళనం, భారీ నిర్మాణ స్థాయి, శక్తివంతమైన కథా లక్ష్యంతో, నాగబంధం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ ఏడాదిలో అత్యంత ఆకట్టుకునే థియేట్రికల్ చిత్రాలలో ఒకటిగా నాగబంధం నిలవనుంది.
తారాగణం: విరాట్ కర్ణ, నభా నటేష్, ఈశ్వర్య మీనన్, రిషబ్ సాహ్ని, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాష్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బిఎస్ అవినాష్ తదితరులు
