1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Vishal comments on Relationship With Varalakshmi Sarathkumar

లవ్వాయణం లేదు... కష్టసుఖాలనే షేర్ చేసుకుంటున్నాం : విశాల్‌

తమ మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదనీ కేవలం తమ ఇద్దరి కష్టసుఖాలను మాత్రమే షేర్ చేసుకుంటున్నట్టు తమిళ నటుడు విశాల్ స్పష్టంచేశారు. ఈయన తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో ప్రేమలో పడినట్టు జోరుగా

Vishal
తమ మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదనీ కేవలం తమ ఇద్దరి కష్టసుఖాలను మాత్రమే షేర్ చేసుకుంటున్నట్టు తమిళ నటుడు విశాల్ స్పష్టంచేశారు. ఈయన తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో ప్రేమలో పడినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.
 
దీనిపై ఆయన స్పందిస్తూ, 'మా ఇద్దరి మధ్య ఏదో సంబంధమున్నట్టుగా షికారు చేస్తోన్న వార్తలు నా వరకూ వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు నేను వరలక్ష్మీ మంచి స్నేహితులం, ఒకరి కష్టసుఖాలు ఒకరికొకరం పంచుకుంటాం.. అంతే' అంటూ ఓ క్లారిటీ ఇచ్చాడు. 
 
అదేసమయంలో రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ల రాజకీయ అరగేంట్ర శుభపరిణామం అన్న విశాల్, తాను ఎవరికి మద్దతు తెలిపేది ఇప్పుడే చెప్పలేనని, ఎన్నికల సమయంలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని తెలిపారు. 
 
కాగా, విశాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం అభిమన్యుడు. సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో విశాల్ బిజిబిజీగా గడుపుతున్నాడు. ఈ సందర్భంగా ప్రేమాయణంపై స్పందించాడు. 
About Writer
pnr
తర్వాతి కథనం
జబర్దస్త్ యాంకర్ చలాకీ చంటి కారుకు ప్రమాదం.. నుజ్జునుజ్జు..