ప్రజాస్వామ్యంపై ఎందుకు గొడవలు జరుగుతున్నాయి?
Shubhalekha Sudhakar
ఈ సినిమాలోని పాత్ర గురించి జూమ్ ఇంటర్వ్యూలో శుభలేఖ సుధాకర్ తెలిజేస్తున్నారు. కుర్రాళ్ళైన టీమ్ ఈ కథను బాగా రాశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశాడు. మరి యాభై ఏళ్ళుగా ఎందుకు గొడవలు జరుగుతున్నాయి. డెమొక్రసీ పేరుతో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. నాకు ఊహ తెలిసినప్పటినుంచీ ఇదే ప్రశ్న. ఇంకా జవాబులేనిదిగానే మిగిలి వుంది. ఈ కథలో నా పాత్ర తీర్చిన విధానం అద్భుతంగా వుంది. అన్నారు.
నటి ఆమని మాట్లాడుతూ, ఏదో మామూలు సినిమా అని నటించాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఎంత అద్భుతంగా ఇప్పటి కుర్రాళ్ళు ఈ సినిమాను రాసుకున్నారో అనిపించింది. ఇప్పటి తరమైనా రాజ్యాంగంపై మంచి అవగాహన వుంది. దేశానికి వెన్నెముకలైన యూత్ తీసిన ఈ సినిమా అందరినీ ఆలోచింపజేస్తుంది అన్నారు.
