నితిన్‌కు రాజమౌళి మిత్రుడు హిట్ ఇస్తాడా!
ChadraSeka, Rajamouli, Nitin
ఇక రాజమౌళి, తన స్నేహితుడు చెక్‌ను ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చాడు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై `ఈ మధ్య కాలంలో ఒక టీజర్ చూసి ఎప్పుడెప్పుడు థియేటరుకెళ్లి సినిమా చూద్దామా అనిపించింది చెక్ విషయంలోనే` అని చెప్పాడు. టీజర్ అంత ఆసక్తికరంగా, కొత్తగా అనిపించిందని రాజమౌళి అభిప్రాయపడ్డాడు. తెలుగులో మాస్, క్లాస్ సినిమాలు అనే తేడాలు తగ్గాయని.. ఐతే చెక్ సినిమాతో ఈ గీత పూర్తిగా చెరిగిపోతుందని తాను నమ్ముతున్నానని చెప్పాడు. నితిన్ ఒకప్పుడు ఒక పరిధిలో ఉండి ఇలాంటి సినిమాలే చేస్తాడు అనే ముద్ర వేసుకున్నాడని, అలాంటి దశ నుంచి తనను తాను కొత్తగా మలుచుకుని విభిన్నమైన సినిమాలతో ప్రయాణం సాగిస్తున్నాడని కితాబిచ్చాడు. రాజమౌళి అంతటివాడే తన సినిమా గురించి మాట్లాడడం పట్ల నితిన్ ఆనందపడిపోయాడు. ఇక చంద్రశేఖర్ ఏలేటి మాత్రం మరింత నమ్మకంతో చెక్ సినిమా తప్పక హిట్ అవుతుందని రాజమౌళితో అంటున్నాడు. ఈ సినిమా హిట్ అయితే చాలాకాలం సక్సెస్కోసం చూస్తున్న యేలేటికి మరో ఆరంభం అవుతుంది.

