సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (10:35 IST)

దేవిశ్రీ ప్రసాద్‌కు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన‌ గిఫ్ట్ ఇదే

Devisriprasad gift open
తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’ ఘన విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఉప్పెన’ సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి ఒక కారణమైన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కు మెగాస్టార్ చిరంజీవి సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. ఈ విషయాన్ని దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా తెలియజేశారు. ‘‘ఓ మైగాడ్.. ఈ మెగా గిఫ్ట్ మరియు లెటర్ ఒన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ సర్ నుంచి వచ్చాయి. ఆయన ఈ రోజును, ఈ ఏడాదిని నాకు గుర్తిండిపోయేలా చేశారు. ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. లవ్ యూ చిరు సర్. ఆల్‌వేస్’’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వీడియోను షేర్ చేశారు.
 
‘‘‘బ్లాక్ బస్టర్ ‘ఉప్పెన’ సినిమాకు నా వర్క్‌ను అప్రిషియేట్ చేస్తూ ఈ గిఫ్ట్‌ను, లెటర్‌ను పంపించారు. ఈ లేఖలో ఏముందో మీకు చదవి వినిపిస్తాను. ‘డియర్ డీఎస్పీ.. ఎగిసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ చిత్రాలకు ఎంత ప్యాషన్‌తో సంగీతాన్ని అందిస్తావో.. చిత్ర రంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్‌కూ అంతే ప్యాషన్‌తో మ్యూజిక్‌ను ఇస్తావు. నీలో ఉండే ఈ ఎనర్జీ, సినిమాలకు మ్యూజిక్ ఇచ్చే నీ ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ నిన్న మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ దేవి. నీవు నిజంగా ఒక రాక్‌స్టార్. ప్రేమతో.. చిరంజీవి’’ అంటూ లేఖలో ఉంది. థ్యాంక్యూ సోమచ్ సర్. మీరు ప్రారంభం నుంచే నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. నన్ను మాత్రమే కాదు.. ఎవరినైనా సరే కొత్త టాలెంట్‌ను మీరు ఎంకరేజ్ చేస్తారు. మీరు ఎంకరేజ్ చేసిన ఎవరైనా సరే సక్సెస్ అవకుండా ఉండరు. ఆల్వేస్ లవ్ యూ సర్. నేను ఎప్పటికీ మీ అభిమానినే. అలాగే ఈ ఉప్పెన మూవీ తీసిన మా బుచ్చిబాబు గారికి, మైత్రీ మూవీ మేకర్స్‌కు, మా సుకుమార్ గారికి నేను థ్యాంక్స్ చెబుతున్నా’’ అంటూ మెగాస్టార్ పంపించిన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను ఓపెన్ చేసి చూపించారు.