వరల్డ్ ఫేమస్ లవర్ ట్రెయిలర్... ప్రేమికుల రోజున ఈ రౌడీ బోయ్ ఏం చేస్తాడో?

World Famous Lover Trailer review
ఐవీఆర్| Last Modified గురువారం, 6 ఫిబ్రవరి 2020 (21:17 IST)
విజయ్ దేవరకొండ-రాశీ ఖన్నా
టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన సినిమాలపై యూత్‌లో ఎనలేని క్రేజ్ ఉంటుంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్ డూపర్ హిట్స్‌తో మంచి యూత్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఈ రౌడీ బోయ్ ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ ఎన్నో అంచనాల మధ్య విడుదలై హిట్ కాకపోయినప్పటికీ విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

ఈ సినిమా తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ప్రేమికుల రోజున వచ్చేందుకు రెడీ అయ్యాడు విజయ్. ఇందులో విజయ్ సరసన ఐశ్వర్యా రాజేశ్, ఇసబెల్లా, రాశీ ఖన్నా, క్యాథరిన్ థ్రెస్సాలు హీరోయిన్లుగా నటిస్తుండగా ఇప్పటికే వీరి పోస్టర్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.
World Famous Lover Trailer review

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రెయిలర్ రిలీజ్ అయింది. ఈ ట్రెయిలర్లో విజయ్ దేవరకొండ ఒక్కో హీరోయిన్‌తో ఒక్కో పాత్రలో కన్పించాడు. అంతా ప్రేమ చుట్టూనే తిరుగుతున్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూడండి ట్రెయిలర్‌ను...



దీనిపై మరింత చదవండి :