బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (17:48 IST)

''ప్రతిరోజూ పండగే''-చిన్నతనమే చేర రమ్మంటే సాంగ్ (వీడియో)

సుప్రీం హీరో సాయి తేజ్ ''ప్రతిరోజూ పండగే'' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశీ ఖన్నా హీరోయిన్‌గా ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమవుతోంది.
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ పాటను సినీ యూనిట్ విడుదల చేసింది. ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా గురువారం సాయంత్రం విడుదలైన పాటకు థమన్ ట్యూన్‌ వేశారు. సిరివెన్నెల అద్భుతమైన పదాలు రాయగా, విజయ్ ఏసుదాస్ అంతే అద్భుతంగా పాడారు.
 
'చిన్నతనమే చేర రమ్మంటే.. అంటూ సాగే ఈ పాట గడిచిపోయిన జ్ఞాపకాలను గుర్తు చేసేలా వుంది. ఈ మెలోడీ ప్రేక్షకులను హత్తుకునేలా వుంది. ఈ పాట వీడియోను మీరూ ఓ లుక్కేయండి.