మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 6 ఫిబ్రవరి 2020 (15:40 IST)

మైనపు బొమ్మా? కాజల్ అగర్వాలా? ఎవరు నిజం?

కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మ
హీరోయిన్లకు ఆలయాలు కట్టడం మామూలే. గతంలో ఖుష్బూకు తమిళనాడులో ఆలయాలు కట్టారు. మరికొందరికీ ఆలయాలను కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు అభిమానులు. అయితే తాజాగా ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు మైనపు బొమ్మతో విగ్రహాన్ని ఏర్పాటు చేసేశారు. అచ్చం కాజల్‌లా ఉన్న ఈ విగ్రహం పక్కన నిల్చుని అమ్మడు ఫోటోలకు ఫోజులిచ్చింది.
 
ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో హీరోయిన్ కాజల్ మైనపు విగ్రహాన్ని లాంచ్ చేశారు. సింగపూర్‌లో గల మ్యూజియంలో ఏర్పాటు చేసిన తన మైనపు విగ్రహం పక్కన ఫోజిస్తూ నవ్వులు చిందించింది కాజల్. టాలీవుడ్ నుండి ఈ అర్హత సాధించిన హీరోయిన్‌గా కాజల్ గుర్తింపు సంపాదించుకుంది. ఇక తెలుగు హీరోలలో ప్రభాస్, మహేష్ ఈ అర్హత సాధించారు. 
కాజల్ అగర్వాల్
బాలీవుడ్ నుండి అమితాబ్, హృతిక్, కాజోల్, ఐశ్వర్యా రాయ్, షారుక్, కరీనా కపూర్, అనిల్ కపూర్ ఇలా చాలామంది సెలెబ్రిటీల మైనపు విగ్రహాలు ఈ మ్యూజియం నందు ఏర్పాటు చేశారు కూడా. ఇక ప్రస్తుతం కాజల్ తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు శంకర్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో చేస్తున్న భారతీయుడు 2 సినిమాలో ప్రధాన హీరోయిన్‌గా చేస్తున్నారు. అవకాశాలు తగ్గినా సరే కాజల్‌కు మాత్రం అభిమానుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది.