మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (18:29 IST)

కాజల్ అగర్వాల్‌కు అరుదైన గౌరవం, మేడమ్ టుస్సాడ్స్ విగ్రహం (video)

కాజల్ అగర్వాల్, దక్షిణాది టాప్ హీరోయిన్లలో ఒకరు. మగధీర చిత్రంతో టాప్ స్టార్‌గా మారిన కాజల్ ఆ తర్వాత కూడా అదే స్థాయిలో చిత్రాల్లో నటిస్తూ సాగుతోంది. ఇప్పుడు ఆమె మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 
 
ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన వ్యక్తులకు సంబంధించి మేడమ్ టుస్సాడ్స్ మైనపు బొమ్మలను ఆవిష్కరిస్తుంది. కాజల్ అగర్వాల్ రూపాన్ని కూడా ఆవిష్కరించేందుకు మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు కాజల్ అగర్వాల్‌ను సంప్రదించారు.
ఈ విషయాన్ని కాజల్ ధృవీకరించింది. తన మైనపు బొమ్మను చేసేందుకు సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌ ప్రతినిధులు తనను సంప్రదించినట్లు తెలిపారు. 2020 ఫిబ్రవరి 5న ఈ మైనపు బొమ్మను ప్రదర్శిస్తారని తెలిపారు. 
 
కాగా ఈ గౌరవం పొందిన దక్షిణాది ప్రముఖులలో ప్రభాస్, మహేష్ బాబు, శ్రీదేవి తదితరులు ఉన్నారు.