నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్
Tandel team with Aamir Khan
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మూవీ తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ రోజు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ మూవీ హిందీ ట్రైలర్‌ను ముంబైలో లాంచ్ చేశారు.
అనంతరం అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. తండేల్ ఫిబ్రవరి 7న వస్తుంది. అలాగే మా అబ్బాయి నటించిన సినిమా కూడా అదే రోజు వస్తుంది. అయినా పర్లేదు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి వస్తానని చెప్పాను. కథ బావుంటే ఎన్ని సినిమాలు అయినా ఆడియన్స్ చూస్తారు. తండేల్ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఫెంటాస్టిక్ గా ఉంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు. మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంది. దేవిశ్రీ చేసిన డింకచిక డింకచిక సాంగ్ నా ఫేవరెట్. బేసిగ్గా నాకు డాన్స్ చేయడం ఇష్టం ఉండదు కానీ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. తండేల్ ట్రైలర్ లో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ వున్నాయి. చైతన్య ఫెంటాస్టిక్ యాక్టర్. ఐడియల్ కోస్టార్. తనతో వర్క్ చేయడం చాలా అమెజింగ్ ఎక్స్ పీరియన్స్. తను మంచి హ్యూమన్ బీయింగ్. సాయి పల్లవి కూడా చాలా మంచి పెర్ఫార్మర్. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్' అన్నారు.
నాగచైతన్య మాట్లాడుతూ.. సాయి పల్లవి తో చేసిన లవ్ స్టోరీ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు చూసి చాలా బాగుందని మెసేజ్ పెట్టారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు తండేల్ ట్రైలర్ ని అమీర్ ఖాన్ లాంచ్ చేయడం చాలా బలాన్ని ఇచ్చింది. ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం నాకు మ్యాజికల్ మూమెంట్. లాల్ సింగ్ సినిమా అమీర్ గారితో చేయడం నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆరు నెలల్లో ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కథ చెప్పినప్పుడే నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. శ్రీకాకుళం వెళ్లి అక్కడ మత్స్యకారుల్ని కలుసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన సంఘటనలు విన్నప్పుడు ఈ సినిమా నాకు ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుందో అర్థమైంది. ఇలాంటి కథలు యాక్టర్స్ కి చాలా అరుదుగా వస్తాయి.. దేవిశ్రీ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. మీరంతా ఫిబ్రవరి 7న సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. జునైద్ సినిమాకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్' అన్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ, ఇండియన్ సినిమాకి అమీర్ ఖాన్ కాంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది. ముంబై ఆడియన్స్ నా పాటలకు ఎప్పుడు కూడా చాలా గ్రేట్ రెస్పాన్స్ ఇచ్చారు. డైరెక్టర్ చందు చాలా అద్భుతమైన కథను రాశారు. సినిమాని హార్ట్ టచింగ్ గా తీశారు. నాగచైతన్య ఫెంటాస్టిక్ గా పెర్ఫార్మ్ చేశారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన బీస్ట్ మోడ్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యారు. సాయిపల్లవి మార్వలెస్ గా యాక్ట్ చేసింది. వారి కెమిస్ట్రీ మీ అందరిని ఆకట్టుకుంటుంది. లిరిక్ రైటర్స్ కి, టెక్నీషియన్స్ కి, మ్యూజిషియన్స్ కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది'అన్నారు.