బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (09:25 IST)

హీరో అక్కినేని నాగచైతన్య జట్టుకు ఎఫ్-4 టైటిల్

naga chaitanya team
తెలుగు హీరో అక్కినేని నాగ చైతన్య జట్టుకు ఎఫ్-4 టైటిల్ వరించింది. కోయంబత్తూరు వేదికగా ఆదివారం జరిగిన డామినెంట్ షోలో సత్తా చాటారు. నాగ చైతన్యకు హైదరాబాద్ బ్లాక్‌బర్డ్ ఎఫ్-4 రేస్ టైటిల్ గెలుచుకుంది. ఈ జట్టు యజమానికిగా నాగ చైతన్య ఉన్నారు. రేసర్ అఖిల్ అలీఖాన్ అద్భుత ప్రదర్శన చూపడంతో చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 
 
గోవా ఏసెస్ జేఏ రేసింగ్‌లో రౌల్ హౌమాన్, గాబ్రియేలా జిల్కోవాను అఖిల్ అలీఖాకాన్ ఓడించడంతో ఇండియన్ రేసింగ్ లీగ్ చాంపియన్‌షిప్ గెలుపొందారు. బెంగుళూరుకు చెందిన రుహాన్ అల్వా, ఎఫ్ఐఏ - సర్టిఫైట్ ఫార్ములా 4 ఇండియన్ చాంపియన్ షిప్‌లో గ్రాండ్ డబుల్‌ను సాధించినప్పటికీ హైదరాబాద్ బ్లాక్‌బర్డ్ జట్టు యువకుడు అఖిల్ అలీఖాన్‌ను ఓడించలేకపోయాడు. దీంతో ఆల్వా చాంపియన్‌ షిప్‌లో రెండో స్థానంలో నిలిచాడు.