శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By Selvi
Last Updated : ఆదివారం, 22 జులై 2018 (14:05 IST)

జపాన్ పాపకు జుట్టు ఎలా వుందో చూస్తే షాకవుతారు.. (వీడియో)

చిన్నారుల్లో కొందరిలో జుట్టు పెరగడం.. కొందరికి అంతగా పెరగకపోవడం గమనించవచ్చు. అయితే జపాన్ పాపకు మాత్రం జుట్టు అమాంతం పెరిగిపోతుంది. ఆ పాప వయసు ఏడంటే ఏడు నెలలు. అయితేనేం నెట్టింట ఆమెకు 46 వేల మంది ఫాలోవ

చిన్నారుల్లో కొందరిలో జుట్టు పెరగడం.. కొందరికి అంతగా పెరగకపోవడం గమనించవచ్చు. అయితే జపాన్ పాపకు మాత్రం జుట్టు అమాంతం పెరిగిపోతుంది. ఆ పాప వయసు ఏడంటే ఏడు నెలలు. అయితేనేం నెట్టింట ఆమెకు 46 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆమె తల వెంట్రుకలు పెరుగుతున్న విధానాన్ని పరిశీలించేందుకే. 
 
వివరాల్లోకి వెళితే.. జపాన్‌కు చెందిన చాంకో అనే పాప, తన అందమైన కురులతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఏడు నెలలకే ఇంత జుట్టు ఎలా వచ్చిందా అని నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం చాంకో ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
పుట్టుకతోనే అధిక జుట్టుతో పుట్టిన చాంకోకు, నెలలు గడిచే కొద్దీ మరింతగా వెంట్రుకలు రావడం మొదలైందని పాప తల్లి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. గత సంవత్సరం డిసెంబర్‌లో జన్మించిన చాంకో ఫొటోలను ఎప్పటికప్పుడు చాంకో తల్లి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటే, వేల మంది చాంకో ఫ్యాన్స్ అయిపోయారు. ఆ జుట్టు కూడా వత్తుగా సూపర్ స్టైల్‌లో వుండటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ చిన్నారి జుట్టు ఎలా వుందో వీడియోలో చూడండి.