శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 జులై 2018 (19:47 IST)

రసాయన సూదులతో 20 మంది వృద్ధులను చంపిన నర్సు

జపాన్ దేశంలోని సబర్బన్ టోక్యోకు చెందిన ఓ నర్సు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. ప్రాణాంతక రసాయన సూదుల ద్వారా 20 మంది వృద్ధుల ప్రాణాలు తీసింది. ను వృద్ద పేషెంట్ల శరీరంలోకి ఎక్కించి 20 మంది మృతికి కారణమ

జపాన్ దేశంలోని సబర్బన్ టోక్యోకు చెందిన ఓ నర్సు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. ప్రాణాంతక రసాయన సూదుల ద్వారా 20 మంది వృద్ధుల ప్రాణాలు తీసింది. ను వృద్ద పేషెంట్ల శరీరంలోకి ఎక్కించి 20 మంది మృతికి కారణమైన కేసులో ఓ నర్సుని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సబర్బన్ టోక్యోలోని ఓ హాస్పిటల్‌లో 2016లో ఓ 88 ఏళ్ల వృద్దుడు చనిపోయాడు. ఈయన మృతికి అయూమి కుబోకి(31) అనే మహిళా నర్సు కారణమని తేలింది. దీంతో ఆమెను అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో ఇప్పటివరకూ 20 మందిని చంపినట్లు వెల్లడించారు. 
 
చావుబతుకుల్లో ఉన్న పేషెంట్ల టైమ్‌ని కంట్రోల్ చేయడానికే తాను ప్రయత్నించానని, ఆ సమయంలో 20 మంది చనిపోయినట్లు ఆమె విచారణలో తెలిపింది. 2016లో వృద్దుడుని చంపిన తర్వాత నుంచి నిందితురాలు నర్సుగా పనిచేయట్లేదని పోలీసులు తెలిపారు. అసలు నర్సు ఇదంతా ఎందుకు చేసిందనే దానిపై విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.