సంబంధిత వార్తలు
- ఇన్‌స్టాగ్రాంలో ‘బ్రౌన్ గర్ల్స్’... దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్
- గుడ్లగూబల్లా మేల్కొనే టీనేజర్స్‌కి ఆ సమస్య తప్పదు..
- పాకిస్తాన్లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి... అత్యాచారం చేసి చంపేశారా?
- హిజ్రాలు చదివిస్తున్న విద్యార్థినికి వేధింపులు, అనంతలో ఆత్మహత్యా యత్నం
- గోదావరి పడవ ప్రమాదం: కళ్లెదుటే కట్టుకున్న భర్తను కన్నకూతుర్ని మింగేసిన గోదారి
రౌడీ షీటర్‌ని పెళ్లాడుతానంటూ మొండికేసిన బాలిక, ఏడ్చుకుంటూ వెళ్లిపోయిన రౌడీ
మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. హీరోయిన్ రౌడీ ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత రౌడీ కాస్తా హీరోయిన్ కోసం మంచివాడిగా మారిపోతాడు. ఐతే ఆ తర్వాత అతడిపై వున్న రౌడీ మచ్చ తొలగిపోగా లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటాడు. చివరికి ఎలాగో కథ సుఖాంతమవుతుంది. అది సినిమా. కానీ నిజ జీవితంలో రౌడీని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది. జీవితం నాశనమవుతుంది.
కానీ చెన్నైలోని తిరువేర్కాడుకు చెందిన ఇంటర్ చదువుతున్న ఓ బాలిక మాత్రం తను రౌడీ షీటర్‌ను ప్రేమించాననీ, పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకుంటానంటూ పట్టుబట్టింది. బాలిక తండ్రి ఆమెకి ఎంతో నచ్చచెప్పాడు. రౌడీని పెళ్లాడితే జీవితం దుర్భరం అవుతుందనీ, ఆ ఆలోచన మానుకోవాలని చెప్పినా బాలిక వినలేదు. దీనితో విషయాన్ని పోలీసులకు చేరవేశాడు.
రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు కేసును చిన్నారుల సంరక్షణ చూసే అమ్మ విభాగానికి బదిలీ చేసారు. వాళ్లు బాలికను, ఆమె పేరెంట్స్‌తో పాటు రౌడీ షీటరను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్ పైన ఎన్నో కేసులున్నాయనీ కనుక అతడితో ప్రేమ-పెళ్లి వద్దని చెప్పారు. దానికి బాలిక సమాధానమిస్తూ... తను పెళ్లాడి అతడిని మార్చుకుంటాననీ, తన దారిలోకి తెచ్చుకుంటానని చెప్పింది. ఈసారి తలలు పట్టుకోవడం పోలీసుల వంతైంది.
ఐతే ఇదంతా చూస్తూ వున్న రౌడీ షీటర్ కళ్ల వెంట నీళ్లు పెట్టుకున్నాడట. బాలిక తనపై ప్రేమ చూపించినా తను ఆమెను పెళ్లాడలేకపోతున్నందుకు మథనపడ్డాడట. జీవితంలో ఎలాంటి తప్పు చేయకుండా బతుకుతానని చెప్పి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లాడట. మరి ఆమె కోసం రౌడీ షీటర్ నిజంగా మారుతాడో లేదో?
