సంబంధిత వార్తలు
- ఎన్టీఆర్-ఏఎన్నార్ కెమిస్ట్రీ.. నేడు నాగ్-నాని నటన సూపర్బ్... "దేవదాస్" మూవీ రివ్యూ
- బర్రె నడుచుకుంటూ వచ్చి పాలు ఇవ్వదు... బిగ్ బాస్ పొడుపు కథలు...
- గీత-సామ్రాట్ల మధ్య కొత్త బంధం చిగురించింది...
- ఫినాలెలో టాప్ 2 కంటెస్టెంట్స్‌లో కౌషల్.. తేల్చి చెప్పిందెవరో తెలుసా?
- దేవదాస్ షార్ట్ రివ్యూ... రష్మిక-ఆకాంక్ష అప్సెట్... నాగ్-నాని అదుర్స్
మీ ఆయనతో వర్కవుట్ కాలేదా? నాని షాకింగ్ కామెంట్, బిగ్ బాస్‌పై కె.ఆర్మీ కేసు
సాధారణంగా బిగ్‌బాస్ షోలో జరిగేది అంతా మైండ్ గేమ్. ఇందులో నిర్వాహకులు పార్టిసిపెంట్స్ భావోద్వేగాలను జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు. పార్టిసిపెంట్స్ మనఃస్థితిని అనుసరించి వారితో వివిధ రకాల పనులు చేయించడం, ఇతరులతో పోటీపడేలా చేయడం వంటివి చేస్తుంటారు నిర్వాహ
సాధారణంగా బిగ్‌బాస్ షోలో జరిగేది అంతా మైండ్ గేమ్. ఇందులో నిర్వాహకులు పార్టిసిపెంట్స్ భావోద్వేగాలను జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు. పార్టిసిపెంట్స్ మనఃస్థితిని అనుసరించి వారితో వివిధ రకాల పనులు చేయించడం, ఇతరులతో పోటీపడేలా చేయడం వంటివి చేస్తుంటారు నిర్వాహకులు.
ముల్లును ముల్లుతోనే తీయాలనే విధంగా ఇటీవల ఏర్పాటైన కౌషల్ ఆర్మీ కూడా ఇదే స్ట్రాటజీని అనుసరిస్తోంది. కౌషల్‌కు సంబంధించిన అనుకూల అంశాలను హైలైట్ చేయడం, వాటిని పదేపదే సోషల్ మీడియాలో పంచుకోవడం వంటివి చేయడం వల్ల జనాల్లో కౌషల్‌కు ఆదరణ తీసుకురావడంలో బాగా సఫలమయ్యారు.
అయితే బిగ్‌బాస్ చివరి దశలో ఉండగా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఏకంగా బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నానిపై కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు కౌషల్ ఆర్మీ. ఇటీవల సునీల్, అల్లరి నరేష్ హౌస్‌లోకి వెళ్లినప్పుడు నాని వారితో పెదరాయుడు స్కిట్ వేయించాడు. అందులో కౌషల్ తల్లి పాత్రను పోషించాడు. నాని ఆ తల్లి పాత్రతో సరదాగా 'మీ ఆయనతో వర్కవుట్ కాలేదా' అని ప్రశ్నించాడు.
ఈ వ్యాఖ్యలనే కౌషల్ ఆర్మీక్ ఆయుధంగా చేసుకుని, సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేసి, స్త్రీల గురించి అనుచితంగా మాట్లాడినందుకు నానిపై చర్య తీసుకోవాలని కోరారు. దానికి సమాధానంగా మీకు దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టండి అంటూ హైదరాబాద్ పోలీసుల నుంచి ప్రతిస్పందన రావడంతో, అలా చేయడానికి కౌషల్ ఆర్మీ సిద్ధపడుతున్నట్లు సమాచారం.
మనుషుల భావోద్వేగాలతో గేమ్ ఆడే బిగ్‌బాస్‌తోనే కౌషల్ ఆర్మీ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి కౌషల్‌ను గెలిపించడానికి కౌషల్ ఆర్మీ బిగ్‌బాస్‌పై కూడా కేసులు పెట్టేలా ఉంది.
