శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Modified: గురువారం, 27 సెప్టెంబరు 2018 (11:15 IST)

ఫినాలెలో టాప్ 2 కంటెస్టెంట్స్‌లో కౌషల్.. తేల్చి చెప్పిందెవరో తెలుసా?

బిగ్‌బాస్ సీజన్ 2 ముగియడానికి ఇంకో నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఇంటి సభ్యులలో ఎన్నో అనుమానాలు, ఆందోళనలు ఉంటాయని, ఎవరిని అడగాలో తెలియక లోలోపల సతమతమవుతుంటారని పెద్ద మనస్సుతో బిగ్‌బాస్ ఒక ఏర్పాటు చేసారు. బిగ్ బాస్ హౌస్‌మేట్స్ కోసం ఒక ప్రత్యేక వ్యక్తిని ప

బిగ్‌బాస్ సీజన్ 2 ముగియడానికి ఇంకో నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఇంటి సభ్యులలో ఎన్నో అనుమానాలు, ఆందోళనలు ఉంటాయని, ఎవరిని అడగాలో తెలియక లోలోపల సతమతమవుతుంటారని పెద్ద మనస్సుతో బిగ్‌బాస్ ఒక ఏర్పాటు చేసారు. బిగ్ బాస్ హౌస్‌మేట్స్ కోసం ఒక ప్రత్యేక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి మీ ప్రశ్నలకు సమాధానమిచ్చి, మీకు సరైన మార్గాన్ని సూచిస్తారు. వెంటనే యాక్టివిటీ ఏరియాకి వెళ్లి ఆ ప్రత్యేకమైన వ్యక్తిని కలవండి అంటూ ఆదేశించడంలో అందరూ ఎంతో ఉత్సాహంతో వెళ్లారు.
 
సామ్రాట్: బయట ఉన్న నా సమస్యలు, పరిష్కారం అవుతాయా? టాప్‌ 2లో నేను ఉంటానా? నాపై సానుకూల అభిప్రాయం ఉందా? 
జ్యోతిష్కురాలు: మీకు అంతా పాజిటివ్‌గానే ఉంది. మీ సమస్యలన్నీ నూరు శాతం పరిష్కారమవుతాయి. మీలో నెగివిటీ అస్సలు కనిపించడం లేదు. 
 
గీత: మాకు ఇక్కడ అనిపించినట్లే బయట కూడా కనిపిస్తుందా? బయట అంతా పాజిటివ్‌గా ఉందా? నాకు నా భర్తకు మధ్య బంధం ఎలా ఉంది? 
జ్యోతిష్కురాలు: బయట వేరుగా ఉంటుంది. హౌస్‌లో ఉన్నట్లు లేదు. మీ భర్తతో మీ బంధానికి ఎలాంటి సమస్యా లేదు.
 
కౌశల్: నేను బిగ్‌బాస్ టైటిల్‌ను గెలుస్తానా? టాప్ 2లో ఉంటానా? 
జ్యోతిష్కురాలు: మీరు హార్డ్ వర్కర్. బయట మీకు మంచి పాజిటివ్ టాక్ ఉంది. ఛాన్సులు బాగున్నాయి. తప్పకుండా టాప్‌2లో ఉంటారు. 
 
తనీష్: బిగ్ బాస్ అయ్యాక నా లైఫ్ ఎలా ఉంటుంది? జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు? 
జ్యోతిష్కురాలు: బిగ్‌బాస్ తర్వాత మీకు బాగుంటుంది. మీ ఫ్యామిలీ లైఫ్ కూడా బాగా సాగుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తారు. ప్రజలు, సమాజం కోసం ఏమైనా చేయాలనుకుంటారు. ప్రజల నుండి మీకు చాలా సపోర్ట్ ఉంది. 
 
దీప్తి: బయట నాకు సపోర్ట్ ఎలా ఉంది? ఎంత పాజిటివ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? 
జ్యోతిష్కురాలు: ప్రేక్షకులలో చాలా పాజిటివ్‌గా ఉంది. బాగా ఎనర్జిటిక్‌గా పెర్ఫామ్ చేస్తున్నారు. అదే మీకు పాజిటివ్.