మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (15:47 IST)

దీప్తి నోటి ధాటికి పారిపోవడానికి యత్నించిన నాని... గుడ్లప్పగించి చూసిన బిగ్ బాస్...

ఈ వీకెండ్ శనివారం మొత్తం హాట్ హాట్ డిస్కషన్స్‌తో సాగిన బిగ్ బాస్ ఆదివారం మాత్రం చక్కటి గేమ్‌తో సరదాగా సాగిపోయింది. ఈ గేమ్ పేరు "నీ మంచి కోరి". ఇందులో భాగంగా ఒక మాగ్నెటిక్ బోర్డు, హౌస్‌మేట్స్ ఫోటోలు, అ

ఈ వీకెండ్ శనివారం మొత్తం హాట్ హాట్ డిస్కషన్స్‌తో సాగిన బిగ్ బాస్ ఆదివారం మాత్రం చక్కటి గేమ్‌తో సరదాగా సాగిపోయింది. ఈ గేమ్ పేరు "నీ మంచి కోరి". ఇందులో భాగంగా ఒక మాగ్నెటిక్ బోర్డు, హౌస్‌మేట్స్ ఫోటోలు, అలాగే కొన్ని నెగెటివ్ కామెంట్స్ ఉన్న బోర్డులు ఇచ్చారు. ఒక్కో హౌస్‌మేట్ కళ్లకు గంతలు కట్టి, మిగిలినవారు ఒక్కొక్కరుగా వచ్చి, తమకు మనసులో అనిపించేది మాగ్నెటిక్ బోర్డులో అతికించి వెళ్లాలి. తర్వాత ఆ హౌస్‌మేట్ గంతలు విప్పి, ఒక్కో బోర్డ్ ఎవరు పెట్టి ఉండవచ్చు, ఏ కారణంగా పెట్టి ఉండవచ్చో చెప్పమంటారు నాని. ఎన్ని కరెక్ట్‌గా గెస్ చేస్తున్నారనే దాన్ని బట్టి మిగతావారిపై ఆ హౌస్‌మేట్‌కు ఉన్న క్లారిటీ ఉందో నాని చెప్తారు.
 
మామూలుగానే పేజీల పేజీల ఉపన్యాసాలతో దంచి వదిలిపెట్టే దీప్తి ఈ సారి కూడా ప్రయత్నించింది కానీ అందరూ ఆ ధాటికి భయపడి ఆమె నోరు మూయించేసారు. సామ్రాట్ విషయంలో పెట్టడానికి చెడు ఏమీ తెదని చెప్పగా, ఏదో ఒకటి పెట్టమని అందరూ చెప్పడంతో "నెగెటివ్ థింకింగ్" పెట్టింది, వెంటనే నాని ఏమీ లేదంటూనే ఇంత పెద్ద చెడు విషయం పెడ్తావా అని కాసేపు ఆట పట్టించారు. 
 
తర్వాత గంతలు విప్పిన సామ్రాట్ తనకు వచ్చినవాటిలో ఇదే ఎక్కువ ఇంపాక్ట్ ఉండేదని, ఆ కారణంగానే కనిపెట్టానని చెప్పడంతో అందుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. దీప్తి వంతు రాగానే ఒక్కో బోర్డు ఎవరు పెట్టి ఉంటారో ఊహిస్తూ అందుకు కారణం చెప్పడానికి మళ్లీ మొదలుపెట్టింది. దీంతో హడలెత్తిన నాని పారిపోవడానికి ప్రయత్నించారు, సామ్రాట్ ఆవిడ నోరు మూయగా, మిగతా హౌస్‌మేట్స్ గురక పెట్టి నిద్రపోయారు.
 
కాబట్టి, ఇంటి సభ్యులు ప్రత్యేక అభ్యర్థన మేరకు దీప్తి మాత్రం పేర్లు చెప్తే చాలని, వివరణ అవసరం లేదని నాని తేల్చేయగా, అయినా కూడా మాట్లాడుతూనే ఉంది. ఇంతా చేసి ఒక్క పేరు కూడా కరెక్ట్‌గా ఊహించకపోవడమే ఇందులో హైలైట్. దీనిని చూసి నాని, ఎప్పుడూ మనమే మాట్లాడుతుంటే ఎలా, అవతలివాళ్లకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలంటూ చమత్కరించారు.