శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (12:02 IST)

బర్రె నడుచుకుంటూ వచ్చి పాలు ఇవ్వదు... బిగ్ బాస్ పొడుపు కథలు...

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 ముగింపు దశకు దగ్గర్లో ఉంది. విజేతగా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ అందరిలోనూ కొనసాగుతోంది. హౌస్‌మేట్స్‌లో కూడా లోలోపల ఇదే ఆలోచన ఉంది. కానీ ఇంక హౌస్‌లో ఉండబోయేది 4 రోజులు మాత్రమే కావడ

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 ముగింపు దశకు దగ్గర్లో ఉంది. విజేతగా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ అందరిలోనూ కొనసాగుతోంది. హౌస్‌మేట్స్‌లో కూడా లోలోపల ఇదే ఆలోచన ఉంది. కానీ ఇంక హౌస్‌లో ఉండబోయేది 4 రోజులు మాత్రమే కావడంతో సరదా సరదాగా గడుపుతూ వినోదం పంచారు. దీప్తీ, కౌశల్, తనీష్, గీత, సామ్రాట్‌లు అయిదుగురు మిగలగా ఈ ఎపిసోడ్‌లో అంతా జోకులు వేసుకుంటూ, పొడుపు కథలు చెప్పుకుంటూ సందడి చేశారు. కౌశల్, బిగ్‌బాస్ హౌస్‌లో పెట్టిన బొమ్మలను చూస్తూ సభ్యులను పొడుపు కథలు అడిగాడు. వీటికి దీప్తి ఇచ్చిన సమాధానాలతో మంచి కామెడీ జనరేట్ అయ్యింది. 
 
ఇంతకీ కౌషల్ అడిగిన పొడుపు కథలేమిటంటే... ముందు 64, వెనుక ఒకటే.. ఏమిటో చెప్పుకోండని చెప్పగా, హౌస్‌మేట్స్ ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. దీంతో కౌషలే ‘షార్క్’ అని చెప్పాడు. అదెలాగో చెప్పాల్సిందిగా కోరగా ‘‘షార్క్‌కు ముందు 64 పళ్లు ఉంటాయి, వెనుక తోక ఒకటే ఉంటుంది’’ అని అన్నాడు. 
 
నెక్స్ట్ ‘చూపుకు తెల్ల తలకి బహుబల్ల’ అనే పొడుపు కథకు కూడా సామ్రాట్ ఈజీగానే సమాధానం చెప్పాడు. తెల్లగా ఉండేవి ఏనుగు దంతాలు, బహుబల్ల అంటే పెద్ద తల కలదని తెలిపాడు. ఆ తర్వాత దీప్తి ఏదో పొడుపు కథను అడుగగా సరదాగా ఆట పట్టించారు హౌస్‌మేట్స్. ‘‘బర్రె నడుచుకుంటూ వచ్చి పాలు ఇవ్వదు’’ అని దీప్తి అనడంతో హౌస్‌లో నవ్వుల పూలు పూశాయి.