పంది కడుపున ఏనుగు.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా?

elephant
ఠాగూర్| Last Updated: గురువారం, 31 అక్టోబరు 2019 (18:05 IST)
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి విషయం ఆచరణలో తు.చ. తప్పకుండా జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక సంఘటనలు జరిగాయి కూడా. ఇపుడు తాజాగా... పంది కడుపున ఏనుగు పిల్ల జన్మించింది. ఈ వింత సంఘటన రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది.

ఈ వివరాలను పరిశీలిస్తే, పాలమూరు జిల్లా గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ఓ పంది ఏనుగు పిల్లకు జన్మనిచ్చింది. పందికి ఏనుగు పిల్ల జన్మించడం పట్ల స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. గ్రామానికి చెందిన రాయపురం సారయ్య అనే వ్యక్తి పందులను పెంచి పోషించేవాడు. ఈ పంది గురువారం ఉదయం ప్రసవించింది. ఇందులో ఓ పిల్ల ఏనుగు ఆకారంలో ఉన్న వింత జీవి జన్మించింది. తొండం, దంతాలు, పాదాలు అన్నీ ఏనుగును పోలి ఉన్నాయి.

అయితే పుట్టిన కొద్ది క్షణాలకే ఆ వింత ఆకారం గల జంతువు మృతి చెందింది. గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామల ప్రజలు సైతం తండోపతండాలుగా ఆ వింతను చూడటానికి నాయకపల్లి గ్రామానికి తరలి వచ్చారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన మాటలే ఇప్పుడు నిజమవుతున్నాయంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.



దీనిపై మరింత చదవండి :