సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2019 (18:37 IST)

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె తీవ్రతరం.. హైకోర్టు సీరియస్

తెలంగాణాలో సమ్మె తీవ్రతరం దాల్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 24వ రోజుకు చేరిన సంగతి తెలిసిందే. గత 24 రోజులుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.. దీంతో హైకోర్ట్ ప్రభుత్వంఫై అలాగే కార్మికులఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 
 
సోమవారం సమ్మెఫై హైకోర్ట్‌లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు సర్కారుపై తీవ్రమైన వ్యాఖ్యల్ని చేయడం మాత్రమే కాదు.. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. రాత్రికి రాత్రే సమస్యలన్నీ పరిష్కారం కావని పేర్కొంది. 
 
అయితే ఇందుకు ప్రభుత్వం కూడా తన వాదనలను వినిపించింది. ఆర్టిసీ సమ్మె పరిష్కారానికి విలీన అంశం ప్రధాన ఆటంకంగా ఉందని మిగతా అంశాలపై భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది.