గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (21:31 IST)

చిన్నారి చైత్ర హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య: మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారంటే?

చిన్నారి చైత్ర హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. "అభం శుభం తెలియ‌ని ఆరేళ్ల చిన్నారిపై హ‌త్యాచారానికి పాల్ప‌డిన రాజు అనే కిరాత‌కుడు త‌న‌కు తాను శిక్ష‌ను విధించుకోవ‌డం బాధిత కుటుంబంతో పాటు మిగ‌తా అంద‌రికి కొంత ఊర‌ట క‌లిగిస్తుంది. ఈ సంఘ‌ట‌న‌పై మీడియా, పౌర స‌మాజం గొప్ప‌గా స్పందించాయి. ఇటువంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండేందుకు ప్ర‌భుత్వంతో పాటు పౌర స‌మాజ చొర‌వ చూపాలి."