ఈ వీడియో చూస్తే పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్లు పెట్టరు? (వీడియో)
children addiction
ఈ వీడియోలో స్కూలుకు సిద్ధం అవుతున్న ఓ బాలుడు సెల్ ఫోన్ చూస్తూ కూర్చుని వుండగా.. ఆ బాలుడి తల్లి ఆతనిని మందలించింది. స్కూలుకు వెళ్లే సమయంలో సెల్ ఫోన్లు చూడటం ఎందుకని.. ఆ బాలుడి చేతి నుంచి స్మార్ట్ ఫోన్ లాక్కుంది. బుక్ తీసి హోం వర్క్ పూర్తి చేయమని మందలించింది. ఇక ఆ బాలుడు కూడా బుక్ చేతికి తీసుకుని చదవడం మొదలెట్టాడు.
కానీ స్మార్ట్ ఫోన్ లాక్కుందనే కోపంతో బుక్‌పై కోపం చూపాడు. చదువుపై ఆ బాలుడి మైండ్ పోలేదు. అంతే పుస్తకాన్ని పక్కనబెట్టి బయటికి వెళ్లాడు. తర్వాత లోపలికి వచ్చి గోడకి ఆనించి వున్న బ్యాటుతో తల్లి తలపై లాగి కొట్టాడు.
అంతే ఆ మహిళ కుప్పకూలిపోయింది. అమ్మ కిందపడిపోయిందనే ధ్యాస లేకుండా ఆమె చేతిలో వున్న స్మార్ట్ ఫోనును తీసుకుని మళ్లీ ఫోన్ చూడటం మొదలెట్టాడు ఆ బాలుడు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
சிறுவர்கள் செல்போனுக்கு அடிமையாகியதால் ஏற்படும் விபரீதத்தை பாருங்கள்...இதுவும் ஒருவகை போதை தான்...உஷார் கவனம்...... pic.twitter.com/VfcOD3cwxH
— உண்மை கசக்கும் (@Unmai_Kasakkum) October 1, 2024
