సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2024 (19:00 IST)

షాపింగ్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన 37 ఏళ్ల వ్యక్తి.. ఎక్కడ? (video)

Heart attack
Heart attack
గుండెపోటుతో వున్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా అక్టోబర్ 1, మంగళవారం సాయంత్రం కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూకట్‌పల్లిలోని ప్రగతినగర్ సమీపంలోని జాకీ షోరూమ్‌లో షాపింగ్ చేస్తున్న 37 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు.
 
జాకీ షోరూమ్‌లో బట్టలు కొనుగోలు చేస్తుండగా కుప్పకూలిన బాధితుడిని కలాల్ ప్రవీణ్ గౌడ్‌గా గుర్తించారు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 
 
ఇప్పటికే ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో 20 ఏళ్ల ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. అలాగే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఓ పేషెంట్ వున్నట్టుండి గుండెపోటు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.