గురువారం, 10 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2024 (18:00 IST)

కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించిన అక్కినేని నాగార్జున

Nag letter
Nag letter
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యాలను అక్కినేని నాగార్జున తీవ్రంగా పరిగణించారు. మాజీ కోడలు నటి సమంత విషయంలో కె.టి.ఆర్. పేరు వచ్చేలా మంత్రి చేసిన వ్యాఖ్యాలపై ఆయన మండి పడ్డారు. వెంటనే ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ విషయంపై కోర్టులో కేసు వేయమని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కోరుతున్నారు.
 
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి.  దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని  గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను అని నాగార్జున పోస్ట్ చేశారు.