మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2024 (17:48 IST)

థియేటర్స్, ఓటీటీలోనూ ఆదరణ పొందేలా కలి సినిమా ఉంటుంది : చిత్ర సమర్పకులు కె రాఘవేంద్ర రెడ్డి

K Raghavendra Reddy
K Raghavendra Reddy
ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను తన ఇంటర్వ్యూలో తెలిపారు చిత్ర సమర్పకులు కె రాఘవేంద్ర రెడ్డి.
 
- తెలుగు చిత్ర పరిశ్రమలో పాత్రికేయుడిగా, పీఆర్ఓ గా, మూవీ రైట్స్ కన్సల్టెంట్ గా, రచయితగా పాతికేళ్లుగా జర్నీ చేస్తున్నాను. ఈ క్రమంలో నా మనసుకు నచ్చిన కథల విన్నప్పుడు వాటికి చిత్ర సమర్పకుడిగా పనిచేశాను. గతంలో అలాంటి సిత్రాలు అనే సినిమాకు ప్రెజెంటర్ గా వ్యవహరించాను. "కలి" సినిమా కథ విన్నప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యి ఈ మూవీకి కూడా వర్క్ చేయడం జరిగింది.
 
- కరోనా పాండమిక్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరిగింది. మన దేశంలో కూడా ఇది ఎక్కువగానే ఉంది. ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎవరైనా అడ్డుకుని, వారికి ఆ ఆలోచనను దూరం చేస్తే బాగుంటుంది. ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేవారికి మరోసారి అలాంటి ఆలోచనలు రావు. దర్శకుడు శివ శేషు ఈ పాయింట్ తో "కలి" సినిమా కథ రాసుకున్నాడు. కథ విన్నప్పుడు నాకు కొత్తగా అనిపించింది. ఇలాంటి నేపథ్యంతో సినిమా ఎవరూ చేయలేదనిపించింది. నేపథ్యం కొత్తగా ఉంది. "కలి" లాంటి సినిమా చేస్తే మనకూ పేరొస్తుందని అనిపించింది ఈ సినిమాకు ప్రెజెంటర్ గా వ్యవహరించాను. థియేటర్స్, మల్టీప్లెక్స్ లతో పాటు ఓటీటీలోనూ ఆదరణ పొందేలా మా సినిమా ఉంటుంది.
 
- "కలి" సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా మంది దగ్గర నుంచి ప్రశంసలు వచ్చాయి. "కలి" సినిమా టీజర్ ను కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ రిలీజ్ చేశారు. ప్రభాస్ గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఒక్కసారిగా మా సినిమా అందరికీ రీచ్ అయ్యింది. ట్రైలర్ దర్శకుడు ప్రశాంత్ వర్మ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఓటీటీ సహా బిజినెస్ ఎంక్వయిరీస్ జరిగాయి. ఆ వివరాలు మూవీ రిలీజ్ తర్వాత చెబుతాం.  ప్రిన్స్, నరేష్ అగస్త్య ప్రతిభ గల నటులు. ఇప్పటికే పలు చిత్రాలతో వారు ప్రూవ్ చేసుకున్నారు. "కలి" సినిమాలో వారి పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. నువ్వా నేనా అన్నట్లు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించారు.
 
- శివరామ్ అనే గుడ్ పర్సన్ తన జీవితంలో ఎదురైన కొన్ని ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఆ టైమ్ లో ఒక అపరిచిత వ్యక్తి వచ్చి అతని ఇంటి తలుపు తడతాడు. ఆ అపరిచిత వ్యక్తి ఇంట్లోకి వచ్చాక శివరామ్ జీవితం ఎలా మారింది అనేది "కలి" సినిమా కథ. ఈ పాయింట్ ను ఎలాంటి సందేశాలు, ఉపోద్ఘాతాలు లేకుండా క్రిస్ప్ గా తెరకెక్కించాం. మా మూవీలో వీఎఫ్ఎక్స్ మంచి క్వాలిటీతో ఉంటాయి. వీఎఫ్ఎక్స్ విషయంలో రాజీపడకుండా చేశాం. అలాగే సినిమా కోసం ఒక సెట్ వేసి అక్కడ షూటింగ్ చేశాం. సినిమాకు అవసరం మేరకు ఖర్చు చేశాం. ఎక్కడా వృథా చేయలేదు. బల్లి పాత్రకు ప్రియదర్శి, గోడ గడియారంకు అయ్యప్ప పి శర్మ డబ్బింగ్ చెప్పారు. మీరు సినిమా చూస్తున్నప్పుడు వాళ్లు నటించిన ఫీల్ కలుగుతుంది.
 
- చిన్న హీరోలతో సినిమాలు చేస్తున్నప్పుడు ప్రాక్టికల్ గా బిజినెస్ వర్కవుట్ అయ్యే జానర్స్ చేయడం మంచిది. థియేటర్ తో పాటు ఓటీటీకి నప్పేలా మూవీ సెలెక్ట్ చేసుకోవాలి. 10 నుంచి 15 శాతం అటు ఇటూగా ప్రొడక్షన్ ఖర్చు ఎక్కువైతే ఫర్లేదు. కానీ ఓ రెండు కోట్లు ఎక్కువగా పెడితే ఆ డబ్బు వృథా చేసినట్లే. ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ మూవీ చేస్తే ప్రొడ్యూసర్ సేఫ్ అవుతారు. "కలి" సినిమా ప్రొడ్యూసర్ లీలా గౌతమ్ వర్మ సినిమా మేకింగ్ మీద ప్యాషన్ ఉన్న యువకుడు. పాతికేళ్లు ఉంటాయి. అలాంటి ఏజ్ లో ఉన్న వాళ్లు ప్రేమకథలతో సినిమా నిర్మిస్తారు. కానీ లీలా గౌతమ్ "కలి" వంటి మెచ్యూర్డ్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. అతనికి ప్రొడ్యూసర్ గా మంచి ఫ్యూచర్ ఉంది. భవిష్యత్ లో లీలా గౌతమ్ వర్మ మరిన్ని మంచి మూవీస్ ప్రొడ్యూస్ చేస్తాడు.
 
- దర్శకుడు శివ శేషు ప్రతిభావంతుడు. అతనికి పురాణాల మీద పట్టు ఉంది. ఈ మూవీకి వర్క్ చేస్తున్నప్పుడు శివ శేషులో మంచి టాలెంట్ ఉంది అనిపించింది. అతనికి దర్శకుడిగా "కలి" సినిమా పేరు తెస్తుంది.
 
- కథా రచయితగా నా ప్రయాణం కొనసాగుతోంది. ప్రస్తుతం నేను స్టోరీ ఇచ్చిన సినిమా ఒకటి అమెరికాలో షూటింగ్ జరుగుతోంది. అలాగే డివోషనల్ స్టోరీతో ఓ మూవీ స్క్రిప్ట్ చేశాను. ఆ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. దర్శకత్వం వహించాలనే ఆలోచన లేదు. వృత్తిపరంగా ఎన్నో సినిమాలు నాకు సంతృప్తిని ఇచ్చాయి.