బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2024 (16:39 IST)

ముగ్గురు దొంగలకు చుక్కలు చూపించిన మహిళ.. తలుపు తెరవనీయలేదుగా (Video)

Woman
Woman
గోడెక్కి ఇంట్లోకి ప్రవేశించాలనుకున్న ముగ్గురు దొంగలకు ఓ మహిళ చుక్కలు చూపించింది. గోడదూకి గేటు తెరికి తలుపు తెరుద్దామనుకున్న దొంగలకు చుక్కలు కనిపించాయి. ముగ్గురు మగాళ్లు ఆ ఇంటి మెయిన్ డోర్ తెరవాలనుకున్నారు. 
 
కానీ మహిళ డోర్‌లోపలి వైపు నుంచి ఫుల్ పవర్‌ను ఉపయోగించి దొంగలను తలుపు తెరవనీయకుండా చేసింది. ఒంటరిగా పోరాడి తలుపుకు గడియపెట్టి.. ఒక చేత్తో తలుపును పట్టుకుని మరో చేత్తో సోఫాను లాగి తలుపుకు అడ్డంగా వేసింది. 
 
లోపల పిల్లలున్నారని వారికి ఎలాంటి ప్రమాదం జరగకూడదని భావించిందో ఏమో కానీ మొత్తం భారం వేసి తలుపును ఆ దొంగలు తెరవనీయకుండా చేసింది. దీంతో ఆ దొంగలు పారిపోయారు. ఇలా ముగ్గురు దొంగలపై ఒంటరి మహిళ భారం వేసి.. తలుపులు మూసేసి ఆ మహిళ తన ప్రాణాలను కాపాడుకుంది. ఇంకా చిన్నారులను సేవ్ చేసుకుంది. 
 
ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారంతా ఆ మహిళపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వీడియో ఆధారంగా పోలీసులు దొంగల జాడ కోసం గాలిస్తున్నారు.