భర్త వున్నాడమ్మా.. అంటూ అడిగి.. హెల్మెట్ ధరించి కత్తితో దాడి చేశాడు..  
                                       
                  
                  				  కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం మాచినపేటలో ఆదివారం ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన జరిగినప్పుడు బానోత్ నందిని అనే మహిళ తన మూడు నెలల పాపతో ఇంట్లో ఉంది. 
				  											
																													
									  
	 
	భర్త వీరభద్రమ్ ఉన్నాడని అని అడుగుతూ ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు కత్తితో తలపై గాయపరిచాడు. ఆ మహిళ నొప్పితో కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు ఆమెను రక్షించారు. హెల్మెట్ ధరించి ఉన్న దుండగుడు తన మోటార్ బైక్‌పై అక్కడి నుంచి పారిపోయి కొత్తగూడెం వైపు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. 
				  
	 
	గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.