ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (14:46 IST)

ప్రకాశ్ రాజ్‌ను అంకుల్ అని పిలుస్తా.. ఆయనంటే గౌరవం వుంది.. విష్ణు

manchu vishnu
మా అధ్యక్షుడు మంచు విష్ణు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. తన అభిప్రాయాన్ని మాత్రమే తాను వెలిబుచ్చానని..  అందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదని విష్ణు స్పష్టం చేశారు. 
 
ప్రకాశ్ రాజ్ తెలియజేసిన అభిప్రాయం ఆయన వ్యక్తిగతం. అలాగే తన అభిప్రాయం తనది. ఒక హిందువుగా, తిరుపతి వాసిగా ఈ వివాదానికి మతం రంగు లేదని గర్వంగా చెప్పగలనని.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ సరికాదని తెలియజేశానని మంచు విష్ణు వెల్లడించారు. 
 
తన తండ్రి సినిమాల్లో ఆయన నటించారు. ఎంతోకాలం నుంచి ఆయన తెలుసు. అంకుల్ అని పిలుస్తుంటాను. ఆయనంటే గౌరవం వుందని విష్ణు చెప్పారు. 
 
నటీనటులను వుద్దేశించి మాట్లాడుతూ.. తాను మాట్లాడటం కొందరికి నచ్చవచ్చు.. నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్లు మమ్మల్ని సులభంగా టార్గెట్ చేస్తారని... అంటూ జాగ్రత్తగా మాట్లాడతారు. ఈ వివాదంపై బహిరంగంగా మాట్లాడితే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయేమోనని భయంగా వుందన్నారు.