శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 28 సెప్టెంబరు 2024 (22:08 IST)

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

Difficulty of a child-bearing woman in dangerous river water
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రభావిత జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అల్పపీడనం కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగల మండలానికి చెందిన బాలింత తన పసికందును తీసుకుని పుట్టింటికి వెళ్లేందుకు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వాగును దాటాల్సిన పరిస్థితి తలెత్తింది.
 
మేరీజ్యోతి అనే మహిళ కాన్పు అనంతరం తన శిశువుతో పుట్టింటికి ప్రయాణమైంది. ఐతే తన తల్లిగారి ఊరు పింజరికొండకు వెళ్లే దారిలో కొండవాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వాహనం వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీనితో కుటుంబ సభ్యులలో ఒకరు ఆమెను భుజాలపైకి ఎక్కించుకుని వాగు అవతలికి చేర్చారు. ఈ వీడియో ఇపుడు వైరల్ అయ్యింది.