ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (13:32 IST)

క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌.. మూడేళ్ల చిన్నారి పాట అదుర్స్.. వీడియో వైరల్

Girl
Girl
క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటపడిన మూడేళ్ల చిన్నారి పేరు ఏంజెలికా నీరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఏంజెలికా క్యూట్ గర్ల్ మాత్రమే కాదు.. అసాధారణమైన ప్రతిభావంతురాలిని కూడా. మరోసారి ఈ వీడియో ద్వారా ఆమె ప్రతిభను చాటింది. 
 
గతంలో ఈ చిన్నారి పాట పాడిన వీడియోలు చాలా పాపులర్ అయ్యాయి. తాజాగా ఈ చిన్నారి పాటపాడిన వీడియోను పియానో కళాకారుడు ఎమిల్ రీనెర్ట్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ ‘టైటానిక్’ సినిమాలోని ‘మై హార్ట్ విల్ గో ఆన్’ అనే సాంగ్‌ను పియానో ఆర్టిస్ట్ తో కలిసి చిన్నారి పాడింది. 
 
ఈ వీడియోను కొద్ది రోజుల్లోనే 19కోట్ల మందికిపైగా నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చిన్నారిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.