ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

వందే భారత్ రైలు అద్దం ఎందుకు పగులగొట్టాడంటే... (Video)

vande bharat window
సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది. ఓ యువకుడు సుత్తితో వందే భారత్ రైలు కిటికీ అద్దాన్ని పగులగొడుతుండటం ఆ వీడియోలో కనిపించింది. అయితే, ఆ యువకుడు ఎందుకు వందే భారత్ అద్దాన్ని పగులగొడుతున్నాడంటూ సోషల్ మీడియాలో వేదికగా అనేక మంది నెటిజన్లు ప్రశ్నిస్తూ కామెంట్స్ చేశారు. 
 
దీనిపై రకరకాలైన సమాధానాలు, అభిప్రాయాలు వెల్లడయ్యాయి. కొందరైతే ఈ పనికి పాల్పడిన ఆ యువకుడిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇంతకీ అద్దాన్ని పగులగొడుతున్న యువకుడు ఎవడు, అద్దం పగులగొట్టడానికి కారణం ఏంటి, అది ఏ స్టేషన్, ఆ వందే భారత్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. 
 
వీటికి ఇపుడు సమాధానం లభించింది. ఆ వందే భారత్ రైలు ఆగివున్నది ఓ రైల్వే స్టేషన్ కాదు. ఓ ట్రైన్ కోచ్ కేర్ సెంటర్ అని తేలింది. ఆ యువకుడు ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేసే ఉద్యోగి. వందే భారత్ రైలుకు పాడైపోయిన అద్దాన్ని తొలగించి, దాని స్థానంలో కొత్త అద్దం బిగించేందుకు పాత అద్దాన్ని ఆ విధంగా సుత్తితో కొట్టి తొలగిస్తున్నాడని తెలిసింది. ఏది ఏమైనా ఈ వీడియోకు మాత్రం లైకులు, షేర్లు ఓ రేంజ్‌లో వచ్చాయి.