బుధవారం, 4 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2024 (12:02 IST)

విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav
Suryakumar Yadav
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ బ్రేక్ చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024లో అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన గ్రూప్-1 సూపర్-8 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో భారత్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. 
 
ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టీ20 కెరీర్‌లో ఇది సూర్యకు 15వ అవార్డ్. 64 టీ20 మ్యాచ్‌ల్లో సూర్య ఈ ఫీట్ సాధించడం విశేషం. విరాట్ కోహ్లీ మాత్రం 121 మ్యాచ్‌ల్లో 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్నాడు.