బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 మే 2024 (08:58 IST)

దేశం కోసం ప్రపంచ కప్ గెలిచేందుకు వారిద్దరికిదే ఆఖరి అవకాశం : మహ్మద్ కైఫ్

దేశం కోసం ప్రపంచ కప్ గెలిచే అవకాశం భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఇదే చివరి ఛాన్స్ అని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు. రోహిత్, విరాట్‌లు రిటైర్మెంట్ వయసుకు సమీపంలో ఉన్నారని, అందువల్ల వారిద్దరూ దేశానికి ప్రపంచ కప్ తెచ్చిపెట్టేందు ఇదే సరైన, చివరి అవకాశం అని అభిప్రాయపడ్డారు. 
 
త్వరలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. దీంతో భారత క్రికెట్ జట్టు సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను భారత మాజీ క్రికెటర్ ముహమ్మద్ కైఫ్ అప్రమత్తం చేశాడు. దేశం కోసం ప్రపంచకప్ గెలిచేందుకు వారికి ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేశారు. 
 
'తాను ఎక్కువ రోజులు ఆడలేనన్న విషయంం రోహిత్ శర్మకు తెలుసు. బహుశా మరో రెండు, మూడు ఏళ్లు అతడు ఆడొచ్చు, విరాట్ విషయం కూడా ఇంతే. కాబట్టి వారికి ఇదే చివరి అవకాశం. అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్ వారు కప్ చేజార్చుకున్నారు. ఎవరో వారి నుంచి కప్‌ను బలవంతంగా ఎవరో లాగేసుకున్నట్టు అనిపించింది. అభిమానుల గుండె పగిలింది' అని వ్యాఖ్యానించారు. 
 
2007లో భారత జట్టు ధోనీ సారథ్యంలో తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచుకుంది. నాటి జట్టులో రోహిత్ కూడా ఒక సభ్యుడు. ఇక 2011లో రెండో సారి టీ20 విశ్వవిజేతగా నిలిచింది. అప్పట్లో కోహ్లీ టీమిండియా సభ్యుడిగా ఉన్నాడు. ఇక విరాట్, రోహిత్ ఇద్దరూ 2013 నాటి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలుగా నిలిచారు. వరల్డ్ కప్‌లో ఇద్దరూ కలిసి ఆడినా భారత్ ఫైనల్స్‌లో కప్ చేజార్చుకుంది. పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఈసారి టీ20 వరల్డ్ కప్ భారత్ గ్రూప్ ఏ ఉంది. భారత్‌తో పాటు అమెరికా, ఐర్లాండ్, కెనడా, పాకిస్థాన్, గ్రూప్ ఏలో ఉన్నాయని గుర్తు చేశాడు.