శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 13 జూన్ 2024 (10:41 IST)

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : రాహుల్ చెత్త రికార్డును అధికమించిన విరాట్ కోహ్లీ!!

virat kohli
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. గతంలో రాహుల్ పేరిట ఉన్న ఈ రికార్డును తిరగరాసి ఇపుడు తన పేరుతో లిఖించుకున్నాడు. అమెరికాపై మ్యాచ్ ఖాతా తెరవకుండానే ఔట్ అయిన స్టార్ బ్యాటర్ టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచిన విరాట్. ఇప్పటికే ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. రాహుల్ మొత్తం 5 సార్లు డకౌట్ అయ్యాడు. 
 
అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పతనాల పరంపర కొనసాగుతోంది. ఐర్లాండ్‌పై 1, పాకిస్థాన్‌పై 4 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి.. వరుసగా మూడవ మ్యాచ్‌లోనూ విఫలమయ్యారు. అమెరికాపై మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సౌరభ్ నేత్రవల్కర్ వేసిన ఓవర్లో తొలి బంతికే కీపరు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో టీ20లలో కోహ్లి 6వసారి డకౌట్ అయ్యాడు.
 
టీ20లలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు ఏకంగా 12 సార్లు డకౌట్ అవ్వగా.. ఈ జాబితాలో రెండో స్థానంలో విరాట్ కోహ్లి నిలిచాడు. 5 డకౌట్లతో రెండో స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్‌ విరాట్ దాటేశాడు. మొత్తం 6 డకౌట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక టీ20 వరల్డ్ కప్ గోల్డెన్ డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, సురేశ్ రైనా వంటి ఆటగాళ్ల జాబితాలో కోహ్లి చేరాడు. 
 
టీ20లలో ఎక్కువ సార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్లు
1. రోహిత్ శర్మ - 12
2. విరాట్ కోహ్లి - 6
3. కేఎల్ రాహుల్ - 5