గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 3 జూన్ 2024 (19:02 IST)

నొప్పి నివారణ బ్రాండ్‌ టిఐడిఎల్‌ను భారతదేశానికి తీసుకువచ్చిన విరాట్ కోహ్లి

virat kohli
అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నొప్పి నివారణ బ్రాండ్, టిఐడిఎల్, తదుపరి తరం నొప్పి నివారణ పరిష్కారాలను అందించడానికి క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీతో కలిసి త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. బైద్యనాథ్ గ్రూప్‌తో కలిసి ఈ భాగస్వామ్యం, భారతదేశం నొప్పిని అర్థం చేసుకునే విధానాన్ని మార్చనుంది. 2021లో, వరల్డ్-క్లాస్ UFC ఛాంపియన్ అయిన కోనార్ మెక్‌గ్రెగర్ టీఐడిఎల్ టీమ్‌తో చేతులు కలిపారు.  భారతదేశంలో ప్రవేశం గురించి మెక్‌గ్రెగర్ మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీతో కలిసి టీఐడీఎల్‌ను భారత్‌కు తీసుకురావడం అపురూపమైన గౌరవంగా భావిస్తున్నాము. భారతదేశానికి నిజమైన రికవరీ ఎలా ఉంటుందో చూపించనున్నాము" అని అన్నారు. 
 
“టిఐడిఎల్ యొక్క పరిష్కారాలు భారతీయులు నొప్పిని అర్థం చేసుకునే విధానాన్ని మార్చబోతున్నాయి. నొప్పి అసౌకర్యంగా ఉండటమే కాదు, ఇది మన నిద్ర నాణ్యత, మానసిక ఆరోగ్యం, దృష్టి, శక్తిని దెబ్బతీస్తూ మనలను ప్రభావితం చేస్తుంది. టిఐడిఎల్‌తో, ఈ అడ్డంకులు ఛేదించబడ్డాయి” అని టిఐడిఎల్ సహ వ్యవస్థాపకుడు- COO ప్రశాంత్ రాజ్ తెలిపారు.
 
“ఒక క్రీడాకారుడిగా, మీరు అధిక నొప్పి పరిమితిని స్వీకరించడం నేర్చుకుంటారు. నా లక్ష్యాలపై రాజీ పడకుండా దానితో జీవించడం నేర్పించాను. నొప్పి అనేది ఒక స్థిరమైన సవాలు, ఇది జీవన నాణ్యతకు ఆటంకం కలిగిస్తుంది. టిఐడిఎల్ అనేది గేమ్-ఛేంజర్, మీరు ఉపశమనం పొందే విధానాన్ని మార్చడం ద్వారా మీరు జీవించే ఆనందాన్ని తిరిగి పొందేలా చేస్తుంది. ఈ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా భారతదేశాన్ని నొప్పి రహితంగా మార్చేందుకు ఎదురుచూస్తున్నాం! ” అని విరాట్ కోహ్లీ అన్నారు.
 
బైద్యనాథ్ ప్రెసిడెంట్- టిఐడిఎల్ ఇండియా డైరెక్టర్ సిద్ధేష్ శర్మ మాట్లాడుతూ- “ మేము ప్రతిరోజూ ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని చూడాలని కలలు కంటున్నాము. ఆర్&డి, తయారీ- పంపిణీలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించి, టిఐడిఎల్‌కి భారతదేశంలో సరైన లాంచ్ ప్యాడ్‌ని బైద్యనాథ్ అందించింది" అని అన్నారు.