1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 మే 2024 (10:14 IST)

ఐపీఎల్ 2024 సీజన్‌ ఫైనల్.. సన్ రైజర్స్ ఓటమి.. కావ్య పాప ఏడుపు

Kavya Maran
Kavya Maran
ఐపీఎల్ 2024 సీజన్‌ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో ఆ జట్టు యజమాని కావ్యా మారన్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. కన్నీళ్లు పెట్టుకుంది. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టింది. 
 
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ మధ్యలోనే ముఖం చాటేసిన కావ్యమారన్.. కేకేఆర్ విజయానంతరం మళ్లీ స్టాండ్స్‌లోకి వచ్చింది. 
 
అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన తమ జట్టును చప్పట్లతో అభినందించింది. ఈ వీడియోను చూసి సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు 'ధైర్యంగా ఉండండి మేడమ్' అంటూ కామెంట్ చేస్తున్నారు.