ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (21:41 IST)

పిడుగుపాటుకు గురైన ఫుట్‌బాల్ క్రీడాకారుడు.. తర్వాత ఏమైందంటే?

Footballer
Footballer
ఇండోనేషియా ఫుట్‌బాల్ ఆటగాడు పిడుగుపాటుకు గురైన భయానక వీడియో క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ జావాలోని బాండుంగ్‌లోని సిలివాంగి స్టేడియంలో శనివారం జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో సుబాంగ్‌కు చెందిన సెప్టైన్ రహర్జా అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురై కుప్పకూలిపోయాడు. ఘటన జరిగినప్పుడు మ్యాచ్ జరుగుతోంది.
 
ఫుట్‌బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురయ్యాడు. దీంతో స్థానిక ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. కానీ ఆ క్రీడాకారుడు వెంటనే మరణించినట్లు ఇండోనేషియా మీడియా తెలిపింది. 35 ఏళ్ల సెప్టెయిన్ రహర్జా పిడుగుపాటుకు గురైన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.